ఐసిస్ దారుణాలు: చారిత్రక దేవాలయాన్ని పేల్చేశారు
సిరియా: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల (ఐసిస్) దారుణాలు కొనసాగుతున్నాయి. ఐసిస్ చారిత్రక ప్రదేశాలను ధ్వంసం చేస్తున్నారు. తాజాగా, సిరియాలో వాళ్లు చారిత్రక దేవాలయాన్ని పేల్చేశారు.
పామిరా నగరంలో అత్యంత ప్రఖ్యాత, పురాతన కట్టడమైన ఆలయాన్ని వారు బాంబులతో పేల్చేశారు. ఈ విషయాన్ని స్థానిక పురవాస్థు శాఖ చీఫ్ మామౌస్ అబ్దుల్ కరీం వెల్లడించారు.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు గతంలోనే నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రోమన్ కాలం నాటి శిథిలమైన చారిత్రక కట్టడాలు పామిరా నగరంలో ఉన్నాయి. కొద్ది రోజుల్లనే ఉగ్రవాదులు చారిత్రక సంపదను మొత్తం నాశనం చేసే అవకాశముందని అబ్దుల్ కరీం వాపోయారు.

బాంబులతో పేల్చేయడం వల్ల ఆలయం బాగా దెబ్బతిందని చెప్పారు. గత జూలైలోనే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రముఖ లయన్ స్టాచ్యూ ఆఫ్ ఎథేనాను నాశనం చేశారని చెప్పారు.
ఇస్లామిక్ తీవ్రవాదులు బాంబులతో పేల్చేసిన పురాతన ఆళయం బాల్షామిన్. గత వారం ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ ఖలీద్ అసద్‌ను ఉగ్రవాదులు తల నరికి చంపేశారు. కాగా, ఉగ్రవాదులు బాంబులు పెట్టి పేల్చేసిన బాల్షామిన్ ఆలయం 2వేల ఏళ్ల కిందటిది.












Click it and Unblock the Notifications