మిస్ యూనివర్స్ ను చంపేయండి: ఐఎస్ఐఎస్

మనీలా: ఫిలిప్పీన్స్ లో జరగనున్న మిస్ యూనివర్స్ పోటీలను లక్షంగా చేసుకుని దాడులు చేస్తామని, అందుకు తాము సన్నాహాలు చేస్తున్నామని ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ప్రకటించింది.

ఐఎస్ఐఎస్ ఫిలిప్పీన్స్ సపోర్టర్స్ అనే టీంకు ఓ వీడియో టెలిగ్రామ్ మెసేంజర్ ద్వారా పంపించిందని ఇంటిలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. ఆ వీడియోలో సానుభూతిపరులకు ఐఎస్ఐఎస్ పలు సూచనలు ఇచ్చింది.

ISIS calls for an attack on the Miss Universe contest in Philippines

మిస్ యూనివర్స్ ను చంపేందుకు ఓ శక్తివంతమైన బాంబు తయారు చెయ్యాలని ఉగ్రవాదులు సూచించారు. ఆ వీడియోలో ఆత్మాహుతి దాడి కోసం వాడే బెల్టులు, దుస్తులు ఎలా తయారు చెయ్యాలి అని క్షుణ్ణంగా వివరించారు.

ఎలాగైనా మిస్ యూనివర్స్ పోటీలను లక్షంగా చేసుకుని దాడులు చెయ్యడానికి సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ముందు జాగ్రత చర్యగా పిలిప్పీన్స్ పోలీసు అధికారులు ఇప్పటి నుంచే అలర్ట్ అయ్యారు. అనుమానితులపై నిఘా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+