Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐఎస్ఐఎస్ అధిపతి అబూబాకర్ మృతి: రేడియో ఇరాన్

టెహ్రాన్: అమెరికా దళాలు జరిపిన దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ అధిపతి అబూ బాకర్ అల్ బాగ్దాదీ మృతి చెందాడు. ఈ మేరకు సోమవారం ఇరాన్ రేడియో కథనాలు ప్రసారం చేసింది. కాగా, ఇరాన్ రేడియో పేర్కొన్న కథనాన్ని ఆలిండియా రేడియో తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.

బాంబు దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఐఎస్ అధిపతి అబూబాకర్ ఇప్పుడు మృతి చెందాడు అని ఇరాన్ రేడియో పేర్కొంది. అయితే అతని మృతి ఇంకా ధృవీకరించబడలేదు. కాగా, అబూబాకర్ అల్ బాగ్దాదీ తలపైన 10 మిలియన్ల డాలర్లను అమెరికా ప్రకటించింది.

ISIS chief Abu Bakr al-Baghdadi reportedly dead, says Radio Iran

గత ఆగస్టు నుంచి ఇరాక్, సిరియాల్లో మారణ హోమం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై అమెరికాకు చెందిన భద్రతా దళాలు దాడులకు దిగాయి. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా నేతృత్వంలోని భద్రతా దళాలు ఇప్పటి వరకు వెయ్యి వైమానిక దాడులు చేశాయి.

అమెరికా దళాలతోపాటు బహ్రెయిన్, జోర్డాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దళాలు కూడా ఐఎస్ ఉగ్రవాదులపై దాడులు చేస్తున్నారు. ఈ దళాలు సెప్టెంబర్ 23 నుంచి సిరియా ప్రాంతంలో 800కు పైగా వైమానిక దాడులను చేశాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+