వ్యభిచారానికి నో: 19 మంది తలలు నరికిన ఐసీస్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్ధ ఐసిస్ తీవ్రవాదుల దారుణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇటీవలే 19 మంది యువతులు తమకు లైంగిక బానిసలుగా ఉండేందుకు ఒప్పుకోలేదని అత్యంత కిరాతకంగా తలలు నరికి చంపేశారు.
ఆ మహిళలను తీవ్రవాదులు ఇరాక్‌లోని మోసూల్ ప్రాంతంలో బందీలుగా తీసుకున్నారు. అంతేకాదు యువతుల పెట్రోల్ బ్యారెల్స్ అమ్మనట్లుగా అమ్ముతారని, వారి వయసుని బట్టి ఖరీదు ఉంటుందని కుర్దిష్ ఉద్యమకారుడు ఒకరు ఐక్యరాజ్య సమితికి తెలియజేశాడు.

ఖరీదు ఇలా:
10 ఏళ్ల లోపు వయసున్న చిన్నారుల ఖరీదు 172 డాలర్లు
10 నుంచి 20 ఏళ్ల లోపు వయసున్న యువతుల ఖరీదు 130 డాలర్లు
20 నుంచి 30 ఏళ్ల లోపు వయసున్న మహిళల ఖరీదు 86 డాలర్లు
30 నుంచి 40 ఏళ్ల లోపు వయసున్న మహిళల ఖరీదు 75 డాలర్లు
40 నుంచి 50 ఏళ్ల లోపు వయసున్న మహిళల ఖరీదు 43 డాలర్లు
ఇక టర్కీ, సిరియా లాంటి దేశాల్లో ఒకేసారి ముగ్గురు మహిళల కంటే ఎక్కువ మందిని అమ్మరంట. ఒకవేళ బందీలుగా మహిళలను వారి కుటుంబ సభ్యులే కొనుక్కోవాలంటే మాత్రం ఉగ్రవాదులు ఆ మహిళలు అమాంతం ఖరీదుని పెంచేస్తారంట.












Click it and Unblock the Notifications