కిరాతకం:ఆచారాలకు వ్యతిరేకంగా ఉన్నారంటూ తల నరికి , ఐసిస్ ఇలా...

మతాచారాలను ఇరాక్ ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని ఆరోపిస్తూ అందుకు నిరసనగా ఇద్దరు సైన్యాధికారులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పాశవికంగా తలనరికి చంపాదరు.

బాగ్దాద్:మతాచారాలను ఇరాక్ ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని ఆరోపిస్తూ అందుకు నిరసనగా ఇద్దరు సైన్యాధికారులను ఇస్లమిక్ స్టేట్ ఉగ్రవాదులు పాశవికంగా తలనరికి చంపాదరు. షీయాల ఆధిఫత్యమున్న కర్బాలా సిటీలో ఈ దారుణం చోటుచేసుకొంది.

కర్బాలా సిటీలో ఐసిస్ ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడ్డారు. సైన్యాధికారులు అబ్బాస్ యాసిన్ హుస్సేన్ ,అలీ ఆల్ దరాజీల శిరఛ్చేధన దృశ్యాలను వీడియో తీసి ఉగ్రవాదులు ఆన్ లైన్ లో పోస్టు చేశారని ఓ వార్తా సంస్థ వెల్లడించింది.

ISIS extremists behead two Iraqi officers near Karbala

అమెరికా సహకారంతో దాడులు చేస్తోన్న ఇరాక్ ప్రభుత్వ బలగాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని ఐసిస్ ప్రకటించింది. దక్షిణ ఇరాక్ లోని కర్బాలలో ఇటీవలే ఉగ్రవాదులపై సైనిక దాడుల సమయంలో ఈ ఇద్దరు అధికారులు ఉగ్రవాదులకు చిక్కారు.

మరో వైపు అబూ బకర్ అల్ సమురాయ్ పేరు గల సైన్యాధికారిని ఐసిస్ అధికారులు మెడకోసి చంపేసి వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. మృత్యువుకు దగ్గరవుతున్న చివరిక్షణంలోనూ భయం కనపడని సైన్యాధికారి వీడియో మీడియాలో విపరీతంగా కన్పిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+