9/11కు మించిన దాడులు: అమెరికాకు ఐఎస్ఐఎస్

సిరియా: అమెరికాను అల్లకల్లోలం చేసిన 9/11 దాడులను మించిన దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ హెచ్చరించింది. దాడుల కోసం పేలుడు పదార్థాలను నింపిన కార్లను, మానవ బాంబులను అమెరికాలోకి పంపిస్తామని ఐఎస్‌ఐఎస్ తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో పేర్కొంది.

2001, సెప్టెంబర్ 11న దాడులు జరిగి 14 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ వీడియోను రూపొందించినట్లు తెలుస్తోంది. వెనకాల వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లు కూలిపోతున్న దృశ్యాల ముందు కూర్చొని ఒసామా బిన్ లాడెన్ అమెరికాను ఉద్దేశించి చేసిన హెచ్చరికలను కూడా ఈ వీడియోలో పొందుపర్చారు.

Isis: Extremists release alarming new video on 9/11 anniversary

అమెరికన్లను, యూదులు, క్రైస్తవులను ప్రతి ముస్లిం ద్వేషించే రోజులు వస్తాయని, ఈలోగా ప్రపంచంలోని జిహాదీలంతా ఏకం కావాలని ఐఎస్‌ఐఎస్ టైస్టులు వీడియోలో పిలుపునిచ్చారు.

'అల్లా సైనికులం సిద్దంగా ఉన్నాం' అనే మార్చింగ్ సాంగ్‌తో జీపుల్లో టెర్రరిస్టులు వెళుతున్న దృశ్యాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి. సెప్టెంబర్ దాడులను పునరావృతం చేస్తామంటూ రెండు ట్విట్టర్ ఖాతాల ద్వారా కూడా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+