ఐసిస్ ఘోరం: యువతిని 20మంది పెళ్లి చేసుకొని ప్రతిసారి..., నగ్నంగా పరేడ్

సిరియా: ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) దారుణం మరొకటి వెలుగు చూసింది. ఐసిస్ ఉగ్రవాదులు మరీ క్రూరంగా ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ యునైటెడ్ నేషన్స్ అఫీషియల్ మరో దారుణాన్ని తెలిపింది.

ఐసిస్ తీవ్రవాదులు ఓ సెక్స్ స్లేవ్ యువతికి బలవంతంగా ఇరవై మంది ఫైటర్స్‌తో పెళ్లి చేయడంతో పాటు, ఆమె కన్యత్వ పునరుద్ధరణ కోసమంటూ ప్రతిసారి సర్జరీ చేసిన దారుణ సంఘటనను వెలుగులోకి తెచ్చారు.

ఐసిస్ తీవ్రవాదులు వందలాది మంది సిరియా, ఇరాకీ యువతులను స్లేవ్ బజారులో పెడతారు. అనంతరం వారిని ఆయా ప్రావిన్సులకు పంపిస్తారు. వారిని ఫైటర్స్‌కు ఇస్తారు.

ISIS forced woman to restore virginity every time she was married to 20 fighters

బంగూరా అనే అతను దాదాపు పన్నెండు మందికి పైగా మహిళలను, యువతులను ఇంటర్వ్యూ చేశాడు. ఐసిస్ తీవ్రవాదుల ఘాతుకాలు ఎదుర్కొని, వారి నుండి బయటపడిన వారిని అతను ఇంటర్వ్యూ చేశాడు. వారి ద్వారా విషయాలు తెలుసుకున్నాడు.

ఓ అమ్మాయిని ఇరవై మంది ఫైటర్స్ పెళ్లి చేసుకున్నారని, వారిలో ఒక్కొక్కరు పెళ్లి చేసుకున్న ప్రతిసారి ఆమెకు సర్జరీ చేశారని, కన్యత్వం పునరుద్ధరణ కోసమని అలా చేశారని బాధితుల్లో కొందరు చెప్పారు. తమను ఆయా ఫైటర్స్ వద్దకు పంపించే ముందు తమను నగ్నంగా పరేడ్ చేస్తారని వారు చెప్పారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+