అమెరికా దాడులు: ఐఎస్ఐఎస్ అధినేత అబూ బాకర్‌కి తీవ్రగాయాలు
మోసుల్: అమెరికా సైనికా దళాల దాడుల్లో ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ అధినేత తీవ్రంగా గాయపడ్డ సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ ఇరాక్‌లో అమెరికా సంకీర్ణ సేనలు జరిపిన వైమానిక దాడిలో ఐస్ఐఎస్ అధినేత తీవ్రంగా గాయపడ్డాడని ది గార్డియన్ పత్రిక తన కథనంలో వెల్లడించింది.
మోసుల్ పట్టణానికి 200 కి.మీ. దూరంలో అల్ బాజ్ అనే జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆ పత్రిక తెలిపింది. ఉమ్ అల్ రౌస్, అల్ ఖరాన్ అనే గ్రామాల మధ్య మూడు వాహనాల కాన్వాయ్‌పై మార్చి 18న సంకీర్ణ సేనలు వైమానిక దాడులు జరిపాయి.

ఈ దాడుల్లో వాహనాల్లోని ఉగ్రవాదులందరూ దుర్మరణం చెందగా, ఐసిస్ అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అమెరికా సంకీర్ణ సేనలకు ఆ కాన్వాయ్‌లో అల్ బాగ్దాది ఉన్న విషయం తెలియదని ది గార్డియన్ పేర్కొంది. అయితే అతను కోలుకుంటున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications