"ఐసిస్"కి బిగ్ షాక్.. అగ్రకమాండర్‌ అబు బిలాల్‌ మనూకీ హతం !

ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థకు బలమైన ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ అగ్ర కమాండర్ అబు బిలాల్ మనూకీని అమెరికా, నైజీరియా సంయుక్త బలగాలు అంతమొందించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు.

ఐసిస్ రెండో ఖలీఫా అయిన అబు బిలాల్ మనూకీ ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతంలో కార్యకలాపాలు నడిపేవాడు. ట్రంప్ తన సోషల్ మీడియాలో శనివారం చేసిన ప్రకటనలో, తమ ఆదేశాలతో ఇరు దేశాల సైన్యం సాహసోపేతమైన, అత్యంత క్లిష్టమైన ఈ మిషన్‌ను విజయవంతంగా పూర్తిచేసిందని తెలిపారు. "ఇకపై ఆయన ఆఫ్రికా ప్రజలను భయపెట్టలేడు, అమెరికన్లపై దాడులు ప్రణాళిక చేయలేడు" అని ట్రంప్ స్పష్టం చేశారు.

isis-leader-abu-bilal-manuki-killed-in-america-and-nizeria-combined-operation-and-trump-post-goes-vi

ఐసిస్ లో రెండవ స్థానంలో ఉన్న అబుల్ బిలాల్ చాలాకాలం అజ్ఞాతంలో గడిపాడు. ఆఫ్రికాలోని స్థానిక ముఠాల నుండి వచ్చిన సమాచారం ఆధారంగానే అతని ఆచూకీ లభ్యమైంది. మనూకీ మరణం ఐసిస్‌కు భారీ నష్టం కలిగించిందని, ఇది ఐసిస్ ప్రపంచ కార్యకలాపాలను బలహీనపరుస్తుందని ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఐసిస్ నేపథ్యం పరిశీలిస్తే, ఇరాక్ యుద్ధం తరువాత "అల్-ఖైదా ఇన్ ఇరాక్" (AQI) నుంచి విడిపోయి, 2014లో అబూ బకర్ అల్-బగ్దాది నేతృత్వంలో "ఇస్లామిక్ స్టేట్"గా తన ఖలీఫత్ (రాజకీయ-మతాధికార వ్యవస్థ)ను ప్రకటించింది. కాలక్రమేణా, 2015 పారిస్, 2016 బ్రస్సెల్స్ దాడులు, 2016 ఒర్లాండో కాల్పులు, అలాగే మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలో పలు ఆత్మాహుతి దాడుల ద్వారా తన ఉనికిని విస్తరించుకుంది.

అబూ బకర్ అల్-బగ్దాది (2013–2019), అబూ ఇబ్రాహీం అల్-హషిమీ అల్-ఖురైషీ (2019–2022), అబూ అల్-హసన్ అల్-ఖురైషీ (2022), అబూ అల్-హుస్సేన్ అల్-హుసైనీ అల్-ఖురైషీ (2022–2023) వంటి నాయకులు గతంలో ఖలీఫాలుగా వ్యవహరించారు. ప్రస్తుతం అబూ హఫ్స్ అల్-హషిమీ అల్-ఖురైషీ (2023 నుండి) సంస్థకు నేతృత్వం వహిస్తున్నాడు.

అమెరికా, భారత్, ఇరాక్‌తో సహా పలు దేశాలు ఐసిస్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. క్రమంగా బలహీనపడిన ఐసిస్ నెట్‌వర్క్, ప్రస్తుతం ఆఫ్రికా-ఆసియా ప్రాంతాల్లో చిన్న సమూహాలుగా కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహరం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+