ఐసీస్ మరో ఘాతుకం: జోర్డాన్ ఫైలెట్‌ను ఏ విధంగా చంపుదామంటూ ట్వీట్ (వీడియో)

న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్ధ ఐఎస్ఐఎస్ అరాచకాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. గతవారంలో బందీగా పట్టుకున్న జోర్డాన్ దేశానికి చెందిన పైలెట్‌ను ఏ విధంగా చంపాలో చెప్పమంటూ ఐఎస్ఐఎస్ మిలిటెంట్ గ్రూప్ ట్విట్టర్‌లో అభిప్రాయాలు కోరుతోంది.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

"జోర్డాన్ పైలెట్ పందిని ఏవిధంగా చంపాలో చెప్పండి" అరబిక్ యాష్ ట్యాగ్‌ని ఉపయోగించి ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు వేలాదిగా స్పందనలు వచ్చాయి. వీటితో పాటు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్ధ కొన్ని ఫోటోలను కూడా ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

Twitter to ask for suggestions on how to kill Jordanian pilot'

డిసెంబర్ 24న జోర్డాన్ యుద్ధ విమాన పైలట్ మువాత్ అల్-కసాబేను మిలిటెంట్లు బందీగా పట్టుకున్నారు. ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను మిలిటెంట్లు ఓ క్షిపణి సాయంతో కూల్చివేయగా, కసాబే ఉత్తర సిరియాలోని యూఫ్రేట్స్ నదిలో పడిపోయాడు. కాగా, బందీగా పట్టుకున్న ఈ పైలట్ ఇంటర్వ్యూను కూడా ఐఎస్ఐఎస్ తన 'దబీఖ్' మాసపత్రికలో ప్రచురించింది.

ఇస్లామిక్ స్టేట్ నిన్ను ఏమి చేస్తుందో తెలుసా అని అడిగిన ప్రశ్నకు గాను పైలట్ మువాత్ అల్-కసాబే... నాకు తెలుసు... నన్ను చంపేస్తారు అనే వ్యాఖ్యలు 'దబీఖ్' మాసపత్రికలో తన ఇంటర్యూలో చివరి ప్రశ్నగా ప్రచురించింది.

ఇటీవల కాలంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున మారణకాండకు పాల్పడుతూ... బ్రిటన్, అమెరికా దేశస్ధులను చంపి... వారి వీడియోలను ఇంటర్నెట్లో పెట్టిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+