వైట్ హౌస్ ను బాంబులతో పేల్చేస్తాం: ఐఎస్ఐఎస్
వాషింగ్టన్/సిరియా: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ ను మానవ బాంబులతో చంపేస్తామని మా నుంచి వారిద్దరు తప్పించుకునే ప్రసక్తేలేదని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
వాసింగ్టన్ ను పేల్చేస్తామని గురువారం వీడియో విడుదల చేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఆ వెంటనే శుక్రవారం మరో వీడియో విడుదల చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోలో ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఓ ఉగ్రవాది మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అధికార నివాసం వైట్ హౌస్ ను పేల్చేస్తామని హెచ్చరించాడు.

వైట్ హౌస్ ను అత్యాధునిక బాంబులతో, కారు బాంబులతో పేల్చేస్తామని బెదిరించాడు. ఆ వెంటనే మరో ఉగ్రవాది మాట్లాడుతూ ఒరాక్ ఒబామా, హోలాండ్ ఎక్కడికి వెళ్లినా మా అనుచురులు వెంబడిస్తారని, మానవ బాంబులతో వారిద్దరిని అంతం చేస్తామని హెచ్చరించాడు.
ప్యారిస్ లో ఏ విదంగా దాడులు చేశామో అదే విదంగా అమెరికాలో దాడులు చేస్తామని పారిస్ బిఫోర్ రోమ్ అనే పేరుతో ఆరు నిమిషాల వీడియోను విడుదల చేశారు. ఇరాక్ లో ఈ వీడియో రూపోందిందని అధికారులు తెలిపారు. అయితే ప్యారిస్ తరహాదాడులు అమెరికాలో జరిగే అవకాశం లేదని ఎఫ్ బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications