ఐసిస్ షాకింగ్: ఫైటర్స్‌లలో ఒకరిని యువతులు పెళ్లాడాలి, హౌస్‌వైఫ్‌లా..!
ఐసిస్ ఉగ్రవాదం ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చేరేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుండి యువతులు పోవడం మరింత శోచనీయం. బ్రిటన్‌కు చెందిన యువతులు, ఇలా చాలాచోట్ల నుండి ఐసిస్‌లో చేరేందుకు వెళ్తున్నారు.
ఐసిస్‌లో మహిళల శాఖను అల్ జవ్రా అంటారు. అల్ జావ్రాలో ఐసిస్‌లో చేరేందుకు వచ్చిన మహిళలకు శిక్షణ ఇస్తారు. సిరియా, ఇరాక్‌లోని ఐసిస్ క్యాంపులో చేరేందుకు వస్తున్న యువతులకు జీహాద్‌తో పాటు వంట చేయడంలోను శిక్షణ ఇస్తున్నారట. ఐసిస్ విషయమై రోజుకో సంచలన విషయం వెలుగు చూస్తోంది.
ఐసిస్‌లో చేరిన యువతులను పాక శాస్త్రంలో కూడా ప్రావీణ్యం వచ్చేలా శిక్షణ ఇస్తున్నారట. ఐసిస్‌లో ఉన్న పురుషులకు వంట పెట్టేందుకు వారికి శిక్షణ ఇస్తున్నారట. అంతేకాదు, ఐసిస్‌లో చేరిన మహిళలు వంటను నేర్చుకొని, ఐసిస్‌లో ఉన్న ఓ పురుషుడిని పెళ్లి చేసుకోవాలంట.
అప్పుడు ఆ యువతులు తమ భర్తలు, తమ కుటుంబంగా భావించి వారికి మంచి వంటకం పెడతారని ఐసిస్ అభిప్రాయమని తెలుస్తోంది. ఇంట్లో ఉన్న భార్య రిసీవ్ చేసుకోవడం, మంచి వంట పెట్టినట్లుగా.. ఐసిస్‌లోని పురుషులు ఫీలయ్యేలా యువతులను మార్చుతున్నారట.

ఐసిస్ ఫైటర్స్ డిమాండ్ మేరకు ఆల్ జావ్రా వంటల కోసం ఓ పుస్తకాన్ని కూడా పబ్లిష్ చేసిందట. ఐసిస్‌లో చేరిన యువతులను రాగానే... వారు ఏం చేయదల్చుకున్నారో అడుగుతారు. ఐసిస్ ఫైటర్స్ డిమాండ్ మేరకు వంటల పుస్తకాన్ని తెచ్చారట.
అమెరికా, బ్రిటన్ నుండి వచ్చి ఐసిస్‌లో చేరిన పలువురు యువతులు.. తాము ఫైట్ చూస్తున్న పురుషులకు అండగా నిలబడతామని చెబుతున్నారట. అనంతరం ఆల్ జావ్రా (మహిళల వింగ్)... ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలని యువతులకు సూచిస్తుందట. వారికి వంటతో పాటు ఫస్ట్ ఎయిడ్ నేర్పుతుంది.
వెస్టర్న్‌కు చెందిన ఫైటర్స్ ఫుడ్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ కారణంగానే ఆల్ జావ్రా వంటల పుస్తకం వేయడానికి ఓ కారణమైందని తెలుస్తోంది. ఫైటర్స్‌కు మంచి ఫుడ్ పెడితే వారు మరింత బాగా జీహాద్ కోసం ఫైట్ చేస్తారని ఐసిస్ భావిస్తోందట.
ఐసిస్‌లో చేరుతున్న మహిళలకు వంట ఒక్కటే కాదు.. చంపడం కూడా ఓ ఆప్షన్‌గా ఉందట. ఐసిస్‌లో చేరేందుకు వచ్చిన అందరు యువతులకు వంట నేర్పి, పురుష ఫైటర్స్‌ను పెళ్లి చేసుకొని ఉండాలని నిబంధనలు విధించడం లేదు. పలువురు యువతులకు ఫైటర్స్‌లా కావాలనుకుంటారు. అలాంటి వారికి కూడా శిక్షణ ఇస్తోందట.












Click it and Unblock the Notifications