టార్గెట్ అమెరికా: భారత్‌పై దాడికి ఐసిస్ సన్నాహాలు!
న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) తీవ్రవాదులు భారత దేశం పైన కన్నేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. భారత పైన దాడులు చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సన్నాహాలు చేస్తోన్నారని యూఎస్ఏ టుడే ఓ కథనాన్ని వెలువరించింది.
పాకిస్తాన్ పౌరుడి నుంచి లభించిన 32 పేజీల దస్త్రం ఆధారంగా ఓ కథనాన్ని యూఎస్ఏ టుడే ప్రచురించింది. భారత దేశం పైన దాడులు చేసేందుకు పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ తాలిబన్లు ఏకం కావాలని ఐసిస్ కోరినట్లు అందులే పేర్కొంది.

ఉర్దూ భాషలో ఉన్న 32 పేజీలను హార్వార్డ్ స్కాలర్ అంగ్లంలోకి తర్జూమా చేశారు. భారత దేశం పైన దాడి చేయడం ద్వారా అగ్రరాజ్యం అమెరికాను రెచ్చగొట్టవచ్చన్నది ఐసిస్ వ్యూహంగా కనిపిస్తోందని యూఎస్ఏ టుడే రాసింది.
ప్రపంచ దేశాల పైన తాము దాడికి దిగితే, అమెరికా తన మిత్రపక్షాలతో కలిసి తమ పైన యుద్ధం ప్రకటిస్తుందని, దాంతో ముస్లీంలందరూ ఏకం అవుతారని ఐసిస్ భావిస్తున్నట్లుగా ఆ పత్రిక పేర్కొంది. ఈ పరిణామం అంతిమ యుద్ధానికి దారి తీస్తుందని ఐసిస్ విశ్వసిస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications