వైట్‌హౌస్‌కొచ్చి ఒబామా తల నరుకుతాం: ఐసిస్ వీడియో హెచ్చరిక

వాషింగ్టన్: తాము శ్వేతసౌధానికి వచ్చి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తల నరికేస్తామని, అమెరికాను ముస్లీం ప్రావిన్స్‌గా మార్చుతామని ఉగ్రవాద సంస్థ ఐసిస్(ఐఎస్ఐఎస్) హెచ్చరించింది. అమెరికాను ముస్లీం రాజ్యంగా మార్చాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసింది.

బందీగా పట్టుకున్న ఓ కుర్దు సైనికుడిని ప్రదర్శిస్తూ ఐసిస్ హెచ్చరిక జారీ చేసింది. ఇస్లాంను వ్యతిరేకించే ఎవరికైనా ఇదే గతి పడుతుందని పేర్కొంది. ఒబామా.. అమెరికా వస్తాం, శ్వేత సౌధంలోనే నీ తల నరుకుతాం, అమెరికాను ముస్లీం రాజ్యంగా మార్చుతాం అంటూ పేర్కొన్నది.

 Isis threatens to behead Obama and transform America into a Muslim province

ఫ్రాన్స్, బెల్జియం కూడా మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కారు బాంబులు, పేలుడు పదార్థాలతో విధ్వంసం సృష్టిస్తామని, తలలు నరుకుతామని ఐసిస్ హెచ్చరించింది. బందీగా ఉన్న కుర్దు సాయుధిడి పీక కోశారు. అప్పుడు అక్కడున్న టెర్రరిస్టులు హర్షం వ్యక్తం చేశారు.

కాగా, ఈ వీడియోను ఓ మీడియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ టీవీ మోనిటర్ ప్రాజెక్టు విడుదల చేసింది. అరబిక్‌లో ఉన్న దానిని ట్రాన్సులేట్ చేసింది. వీడియోలో ఐసిస్ తీవ్రవాదులు మాస్కులతో ఉన్నారు. వారు కుర్దీష్ సైనికుడి చుట్టూ తీవ్రవాదులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+