ఐసిస్: ఐదంతస్తుల భవంతి నుంచి కిందకు నెట్టి చంపేశారు
సిరియా: ఇస్లామిక్ తీవ్రవాదుల ఘాతుకానికి అంతులేకుండా పోతోంది. తాజాగా, ఓ సిరియన్ వ్యక్తిని ఐదంతస్తుల భవనం నుంచి కిందకు నెట్టి చంపేశారు. ఇది వారి రాక్షసత్వానికి పరాకాష్టగా నిలుస్తోంది. ఇస్లామిక్ తీవ్రవాదులు హద్దు అదుపు లేకుండా రెచ్చిపోతున్న విషయం తెలిసిందే.
ఓ సిరియన్ వ్యక్తిని ఐదంతస్తుల భవనం పైనుంచి కిందికి నెట్టి అతికిరాతకంగా చంపేశారు. అతను స్వలింగ సంపర్కుడు కావడం వల్లే చంపేశారు. స్వలింగ సంపర్కుడు కాబట్టి అతడిని ఓ ఎత్తైన భవనం పైనుంచి కిందకి తోసేశారు.

అలెప్పో రాష్ట్రం మన్బిజ్‌లో ఈ సంఘటన జరిగింది. ఐసిస్ చట్టం ప్రకారం ఓ వ్యక్తి స్వలింగ సంపర్గుడిగా ఉండడం, ఆ విధానానికి మద్ధతు తెలపడం నేరం. దీంతో ఆ వ్యక్తిని 'గే' అని ఆరోపించి అతన్నిబంధించి మరణ శిక్షను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజలు చూస్తుండగానే తుపాకులు చేత పట్టి ఉన్న ఉగ్రవాదులు ముసుగేసి తాళ్లతో బంధించి ఉన్నఆ వ్యక్తిని నేరుగా బిల్డింగ్ పైనుండి కిందకి పడేశారు. అతడు తల పగిలి మరణించాడు. అనంతరం ఆ సదరు వ్యక్తి భవనం నుండి కిందకు పడేవరకు ఫోటోలు తీసి విడుదల చేశారు.












Click it and Unblock the Notifications