ఐసిస్ ఘాతుకం: పబ్లిగ్గా యువతులపై గ్యాంగ్ రేప్
సిరియా: ఐసిస్ తీవ్రవాదులు సిరియాలో పురాతన కట్టడాలను నాశనం చేస్తున్నారట. తాజాగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ఉత్తర ఇరాక్‌లోని నిమ్రుద్ నగరంలోని అసీరియన్ పురాతన కళాఖండాలను ముక్కలు చేస్తున్నట్లుగా ఉంది. అయితే, ఈ వీడియో ఎప్పటిదో అందులో లేదు.
ఐసిస్ ఉగ్రవాదుల ఘాతుకం

ఐసిస్ ఉగ్రవాదులు యాజిది మహిళల పైన సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఆ మహిళలను ఐసిస్ ఉగ్రవాదులు బహిరంగంగానే సామాహిక అత్యాచారం చేశారని తెలుస్తోంది. సింజార్ ప్రాంతం నుండి వందలాది మహిళలు, పిల్లల్ని ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు.
వారిని నెలలుగా తమ వద్దే ఉంచుకున్నారు. అందులో కొందరిని సెక్స్ స్లేవ్స్‌గా, బహుమతిగా ఇచ్చారు. అంతేకాదు, వారిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చారని వార్తలు వస్తున్నాయి. వారిని లైంగికంగా, భౌతికంగా ఐసిస్ ఉగ్రవాదులు వేధించారు. ఐసిస్ ఉగ్రవాదులు తొమ్మిదేళ్ల బాలిక పైన అత్యాచారానికి పాల్పడగా, ఆమె గర్భం దాల్చినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications