Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‍కు బెయిల్ మంజూరు..
అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం రెండు వారాల బెయిల్ మంజూరు చేసింది. గత సంవత్సరం ఏప్రిల్‌లో ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించారు. గత మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో దేశంలోని అవినీతి నిరోధక సంస్థ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో అరెస్టు చేశారు.
ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ను ఆ దేశ సుప్రీం కోర్టు తప్పుబట్టింది. కోర్టు రిజిస్ట్రార్ అనుమతి లేకుండా కోర్టు ఆవరణలోకి ప్రవేశించి అరెస్టు చేయడం కోర్టు ధిక్కారానికి పాల్పడడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలని అవినీతి నిరోధక శాఖను గురువారం సుప్రీం కోర్టు ఆదేశించింది.

అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చైర్మన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన పాకిస్థాన్ చీఫ్ జస్టిస్ ఉమర్ అటా బండియాల్, జస్టిస్ ముహమ్మద్ అలీ మజార్, జస్టిస్ అథర్ మినాల్లాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది.
మంగళవారం 70 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణంలో అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా ఒక వ్యక్తిని కోర్టు ఆవరణ ఎలా అరెస్టు చేస్తారని ప్రధాన న్యాయమూర్తి బండియల్ ప్రశ్నించారు. కోర్టు రిజిస్ట్రార్ అనుమతి లేకుండా కోర్టు నుంచి ఎవరినీ అరెస్టు చేయరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ముందస్తు సమాచారం లేకుండా న్యాయ సహాయం పొందకుండా అరెస్ట్ చేయడం సరైంది కాదని అభిప్రాయ పడింది.
కోర్టు ఆవరణలోకి ప్రవేశించడం అంటే కోర్టుకు లొంగిపోవడమేనని, లొంగిపోయిన తర్వాత ఒక వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించింది. "ఒక వ్యక్తి కోర్టుకు లొంగిపోతే, వారిని అరెస్టు చేయడం అంటే ఏమిటి" అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. తన క్లయింట్ ముందస్తు బెయిల్ కోసం ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్‌సి)ని ఆశ్రయించాడని, అయితే పారామిలటరీ రేంజర్లు అరెస్టు చేశారని ఖాన్ న్యాయవాది హమీద్ ఖాన్ కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. ఇమ్రాన్ ఖాన్‌తో రేంజర్లు దురుసుగా ప్రవర్తించి అరెస్ట్ చేశారని లాయర్ తెలిపారు.
"కోర్టు ప్రాంగణంలోకి 90 మంది ప్రవేశిస్తే దాని గౌరవం ఏమిటి? ఏ వ్యక్తినైనా కోర్టు ఆవరణ నుండి ఎలా అరెస్టు చేస్తారు" అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో 'కోర్టు ధిక్కారానికి' పాల్పడిందని ప్రధాన న్యాయమూర్తి బాండియల్ అభిప్రాయపడ్డారు. అరెస్టుకు ముందే కోర్టు రిజిస్ట్రార్ నుంచి అనుమతి తీసుకుని ఉండాల్సిందని.. కోర్టు సిబ్బందిని కూడా దుర్భాషలాడరని ఆయన అన్నారు.
వాదనలు విన్న ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. శుక్రవారం ఉదయం ఇస్లామాబాద్ లో అప్పీల్ చేసుకోవాలని ఇమ్రాన్ కోర్టు సూచించింది. ఆయన ఇస్లామాబాద్ హైకోర్టుకు ఆశ్రయించగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications