వారిని ముస్లీం పురుషులు రేప్ చేయొచ్చు: మహిళా ప్రొఫెసర్
కైరో: ఈజిప్ట్‌లోని ఓ మహిళా ప్రొఫెసర్ ఒకరు సంచలన వ్యాఖ్యలు చేసింది. ముస్లీమేతర యువతులు, మహిళల పైన అత్యాచారం చేసే హక్కు ముస్లీంలకు అల్లా ఇచ్చాడని వ్యాఖ్యానించింది. కైరోకు చెందిన అల్ అజర్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ సువాద్ సలేహ్ ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పై వ్యాఖ్యలు చేసింది.
ఆమె చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ముస్లిం పురుషులు ఇతర మతానికి చెందిన మహిళలను లైంగిక బానిసలుగా చూడవచ్చునని ఆమె వ్యాఖ్యానించింది. అయితే, అది అది ఒకసారికి మాత్రమే పరిమితమని చెప్పంది.

ఇజ్రాయిల్ వంటి శత్రువులపై చేసే యుద్ధంలో భాగంగా వారి మహిళలను ఏమైనా చేయవచ్చని చెప్పింది. సదరు ముస్లీమేతర మహిళలను ముస్లీంలు తమ భార్యలతో సెక్స్‌లో పాల్గొన్నట్లుగానే పాల్గొనవచ్చునని చెప్పింది. బానిస మహిళలతో శృంగారం జరపొచ్చని చెప్పింది.
కాగా, ఆ ప్రొఫెసర్ వ్యాఖ్యల ప్రకారం... ఈజిప్టు ముస్లింలు ఇజ్రాయిల్ మహిళలను లైంగిక బానిసలుగా వాడుకోవచ్చని, అత్యాచారాలు చేయవచ్చని ఓ 'న్యూస్ రిపోర్ట్' ఓ కథనాన్ని ప్రచురించింది. ఆమె మాట్లాడిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్లో అందుబాటులో ఉంది. ఆమె వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనిని పలువురు ముస్లింలు కూడా ఖండిస్తున్నారు. ఇస్లాంపై ఇది తప్పుడు ప్రచారమన్నారు.












Click it and Unblock the Notifications