లెబనాన్ దళాల అదుపులో ఐఎస్ఐఎస్ చీఫ్ అబూబాకర్ భార్య, కొడుకు?

లెబనాన్: ప్రపంచ దేశాలకు తలనొప్పిగా మారిన ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్‌కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ బాకర్ అల్ బాగ్దాదీ భార్య, కుమారుడిని లెబనాన్ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం వారు సిరియా నుంచి లెబనాన్‌లో ప్రవేశిస్తూ భద్రతా దళాలకు పట్టుబడ్డారని లెబనీస్ వార్తా పత్రిక ఆజ్ సఫర్ పేర్కొంది.

బాగ్దాదీకి చాలా మంది భార్యలే ఉన్నారు. సంతానం కూడా తక్కువేమి కాదు. కాగా, తాము అదుపులోకి తీసుకున్న మహిళ పేరు, జాతీయత వెల్లడించడానికి లెబనాన్ అధికారులు నిరాకరించారు. ఆమెను ప్రశ్నిస్తున్నట్లు లెబనీస్ రక్షణ శాఖ మంత్రి తెలిపారు.

 Islamic State leader Abu Bakr al-Baghdadi's wife, son 'detained'?

అత్యంత క్రూరమైన ఉగ్రవాద సంస్థ అయిన ఐఎస్ఐఎస్ సిరియాలో ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తున్న నేపథ్యంలో సిరియా పొరుగు దేశమైన లెబనాన్ భద్రతా పరమైన చర్యలను విస్తృతంగా చేపట్టింది. ఉగ్రవాదులు తమ దేశంలో ప్రవేశించకుండా తగు చర్యలు చేపబడుతోంది.

సరిహద్దులో తమ కార్యకలాపాలను విస్తృపర్చేందుకు ప్రయత్నిస్తున్న ఐఎస్ఐఎస్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటికే వందలాది మంది అనుమానితులను అరెస్ట్ చేసినట్లు లెబనాన్ అధికారులు తెలిపారు.

గత జూన్ రూపుదిద్దుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఇప్పటికే ఇరాక్, సిరియా దేశాల్లో పట్టుసాధించి, తమ కార్యకలాపాలను విస్తృతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అమెరికాకు సంబంధించిన రక్షణ దళాలు ఈ రెండు దేశాల్లోని ఉగ్రవాదులపై దాడులు కొనసాగిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+