Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓటమి ఇరాక్ లోనే.. చైనాలో మాత్రం రక్తం ఏరులవడం ఖాయం: ఐసిస్

తాము కచ్చితంగా దేశానికి తిరిగి వస్తామని, చైనాలో రక్తం ఏరులై పారిస్తామని ఉయ్ గర్ మైనారిటీకి చెందిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు స్పష్టం చేస్తున్నారు.

బీజింగ్: ఓ వైపు ఇరాక్ లో తాము ఓడిపోయినట్లు ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబూ బకర్ అల్ బగ్డాది ప్రకటించినా.. మరోవైపు చైనాలో మాత్రం ఆ సంస్థ ఉగ్రవాదులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

తాము కచ్చితంగా దేశానికి తిరిగి వస్తామని, చైనాలో రక్తం ఏరులై పారిస్తామని ఉయ్ గర్ మైనారిటీకి చెందిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు స్పష్టం చేస్తున్నారు. చైనా లక్ష్యంగా ఐసిస్ చేసిన తొలి హెచ్చరిక కూడా ఇదే. సోమవారం విడుదల చేసిన అరగంట నిడివి గల వీడియోలో ఇస్లామిక్ స్టేట్ ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు అమెరికాకు చెందిన సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ వెల్లడించింది.

Islamic State posts new video of Chinese Uighur fighters training in Iraq

తన పశ్చిమ ప్రాంతమైన జిన్ జియాంగ్ లో హింసాత్మక ఘటనలకు బహిష్కరణకు గురైన అక్కడి ఉయ్ గర్ వేర్పాటు వాదులే కారణమని చైనా చాలా కాలంగా చెబుతూ వస్తోంది. వీరికి గ్లోబల్ జిహాదీ గ్రూపులతో సంబంధాలు కూడా ఉన్నాయని ఆరోపించింది.

తాజా వీడియోలో ఓ ఇన్ఫార్మర్ ను హతమార్చే ముందు ఓ ఉయ్ గర్ ఉగ్రవాది ఈ హెచ్చరికలు జారీ చేశాడు. 'మీ చైనీస్ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకోరు. మేం ఖలీఫా సైనికులం. ఆయుధాలతోనే మీకు సమాధానం చెబుతాం. రక్తాన్ని ఏరులుగా పారిస్తాం..' అని ఆ వీడియోలో హెచ్చరించాడు.

ఎక్కువగా ముస్లిం జనాభా ఉన్న ఈ ప్రాంతంపై చైనా వివక్ష చూపుతున్నదని ఉయ్ గర్లు ఆరోపిస్తున్నారు. వారు తమకు ఇస్లామిక్ స్టేట్ తో సంబంధాలు ఉన్నాయని అంగీకరించడం కూడా ఇదే తొలిసారి.

ఇక ఐసిస్ నేరుగా చైనాకు హెచ్చరికలు చేయడం కూడా ఇదే మొదటిసారి అని నేషనల్ సెక్యూరిటీ కాలేజ్ ఆఫ్ ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ ఎక్స్ పర్ట్ మైఖేల్ క్లార్క్ తెలిపారు. ఇస్లామిక్ ఉగ్రవాదుల లక్ష్యం చైనాయే అని ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+