సొంత జీహాదీల తలలు నరికేసిన ఐఎస్ఐఎస్
బాగ్దాద్: తమ కబంధ హస్తాల నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన సొంత సభ్యులను పట్టుకున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) కనికరం లేకుండా అందరి ముందు నడి రోడ్డులో అతి దారుణంగా వారి తలలు నరికేశారు.
ఇరాక్ లోని మోసుల్ లో ఇస్లామిక్ స్టేట్ ఫైటర్లు ఉన్నారు. వారిలో కొందరు యుద్దం చెయ్యలేక తప్పించుకుని పారిపోవడానికి ప్లాన్ చేశారు. మోసుల్ ప్రాంతం నుంచి తప్పించుకున్నారు. అయితే సుమారు 20 మంది ఓ చెక్ పోస్టు దగ్గర ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చేతికి చిక్కిపోయారు.

యుద్దం చెయ్యలేక మోసం చేసి పారిపోతున్నారని ఆరోపిస్తూ ఆ 20 మందిని షరియా కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు వారికి మరణ శిక్ష విధించింది. 20 మందిని రోడ్డు మీద కు తీసుకువచ్చి మోకాళ్ల మీద నిలబెట్టి వారి తలలు నరికి దారుణంగా చంపేశారు.
మానవహక్కుల సంస్థ ఈ విషయాలను ప్రపంచం దృష్టికి తీసుకు వచ్చింది. పారిస్ దాడుల కంటే తీవ్రదాడులను బ్రిటన్ లో చేస్తామని ఐఎస్ఐఎస్ మీడియా బ్రిటన్ దేశాన్ని హెచ్చరించింది. బకింగ్ హామ్ ప్యాలెస్, నేషనల్ గ్యాలరీలు తమ లక్ష్యం అంటూ ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు బ్రిటన్ ను హెచ్చరించారని మీడియాలో వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications