మరో బ్రిటిష్ వ్యక్తి తల నరికి వీడియో విడుదల

వాషింగ్టన్: మరో బ్రిటన్ వ్యక్తి తల నరికి హతమార్చిన వీడియోను ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు విడుదల చేశారు. దీంతో ఉగ్రవాదుల చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన వారి సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఇప్పటికే ఉగ్రవాదులు ఇద్దరు అమెరికన్లను, ఓ బ్రిటన్ వ్యక్తిని హతమార్చి వీడియోలు విడుదల చేశారు.

తాజాగా అలెన్ హెన్నింగ్ అనే బ్రిటిన్ వ్యక్తిని ఉగ్రవాదాలు హతమార్చారు. అంబులెన్స్ ద్వారా సిరియాలో ప్రజలు సహాయం చేస్తున్న అలెన్ హెన్నింగ్స్‌ను ఉగ్రవాదాలు ఏడాది క్రితం అపహరించారు. ఈ వీడియోలో అలెన్ హెన్నింగ్స్‌తో ఐఎన్‌పై దాడి చేయాలని బ్రిటన్ పార్లమెంటు నిర్ణయం కారణంగా తాను బ్రిటిన్ బ్రిటన్ పౌరుడిని అయినందున మూల్యం చెల్లించాల్సి వస్తోందని బలవంతంగా చెప్పించారు

Islamic State shows beheading of British hostage Alan Henning in new video

శుక్రవారం మధ్యాహ్నం ఆ వీడియోను యూట్యూబ్‌లో పెట్టారు. ఆ వీడియో విడుదలైన వెంటనే బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ ప్రతిస్పందించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి తెలిపారు. ఐఎస్ ఎంత కిరాతకంగా వ్యవహరిస్తోందో ఆ హత్య తెలియజేస్తోందని ఆయన అన్నారు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/6krU1FtbQFE?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

హెన్నింగ్స్ హంతకులను పట్టుకుని, శిక్ష విధించడానికి చేయాల్సినంత చేస్తామని ఆయన అన్నారు. తన భర్తను వదిలేయాలని అంతకు ముందు హెన్నింగ్స్ భార్య విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+