Israel: ఉగ్రవాదులే టార్గెట్‍గా గాజాపై ఇజ్రాయెల్ దాడి..
ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం ఐదో రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్ గాజాపై వైమానిక దాడులు కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ ఇజ్రాయెల్‌లో తన సభ్యులను సమీకరిస్తోంది. భారీ సైనిక సామగ్రితో పాటు రిజర్వ్ దళాలకు చెందిన మరింత మంది సభ్యులను కూడా పిలిపించారు. ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల యుద్ధంతో మరణించిన వారి సంఖ్య 3,000 దాటినట్లు స్థానిక మీడియా తెలిపింది.
గాజా సరిహద్దులో ఉన్న దక్షిణ ఇజ్రాయెల్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఇజ్రాయెల్ రాత్రిపూట వైమానిక దాడులు గాజాలోని కిజాన్-అన్-నజ్జర్ పరిసరాల్లోని హమాస్ మిలిటరీ కమాండర్ మొహమ్మద్ దీఫ్ తండ్రి ఇంటిని లక్ష్యంగా చేసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇజ్రాయెల్ సైన్యం ఈ ప్రాంతంలోని అనేక ప్రాంతాలు, రహదారులపై నియంత్రణను చేపట్టింది.

ఇజ్రాయెల్ కు యునైటెడ్ స్టేట్స్ నుంచి 'అధునాతన' మందుగుండు సామగ్రితో మొదటి విమానం ఇజ్రాయెల్ నెవాటిమ్ వైమానిక స్థావరంలో దిగినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ధృవీకరించింది. US ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు మద్ధతు ఇస్తామని ఇప్పటికే స్పష్టం చేసింది.
బిడెన్ హమాస్ దాడులను "పూర్తి దుర్మార్గపు చర్య" అని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అన్నాడు. అవసరమైన అదనపు ఆస్తులను తరలించడానికి మేము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
గోలన్ హైట్స్ ప్రాంతంలో రాకెట్లు పేల్చిన తర్వాత ఇజ్రాయెల్ సైన్యం సిరియాలో షెల్లింగ్ దాడి కూడా ప్రారంభించింది సిరియా భూభాగం నుంచి పాలస్తీనా వర్గం రాకెట్ దాడి చేసిందని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది. US విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ గురువారం ఇజ్రాయెల్ కు సంఘీభావం తెలిపారు. బ్లింకెన్ ఇజ్రాయెల్ ఉన్నత అధికారులతో సమావేశం కానున్నారని తెలుస్తోంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇజ్రాయెల్, గాజాలో పౌర మరణాలలో "విపత్తు పెరుగుదల" పట్ల ఆందోళన చెందుతున్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య యుద్ధానికి అమెరికానే కారణమని పుతిన్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications