ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో నెతన్యాహుకు బిగ్ షాక్.. అరబ్ పార్టీలపై సంచలన ఆరోపణలు!

ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ కూటమికి కూడా స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో ఆ దేశ రాజకీయాల్లో తీవ్ర అలజడి ప్రారంభమైంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని అధికార కూటమి మ్యాజిక్ ఫిగర్ సాధించడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో అరబ్ పార్టీలు ఎన్నికల ఫలితాలను దొంగిలించాయని నెతన్యాహు నేతృత్వంలోని అధికార లీకుడ్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది.

'శత్రువుతో చేతులు కలిపేది ఎవరు?'-ఇజ్రాయెల్ లో విధి విచిత్రం..!
'శత్రువుతో చేతులు కలిపేది ఎవరు?'-ఇజ్రాయెల్ లో విధి విచిత్రం..!

మెజారిటీకి దూరంగా కూటములు
ఇజ్రాయెల్ పార్లమెంట్‌(నెసెట్)లో మొత్తం సీట్ల సంఖ్య 120 కాగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 61 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ కావడం గమనార్హం. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని అధికార కూటమి 54 స్థానాలు గెలుచుకుంది. మాజీ మిలటరీ చీఫ్ ఐసెన్‌కోట్ నేతృత్వంలోని విపక్ష కూటమికి 48 సీట్లు, అరబ్ పార్టీలకు 18 సీట్లు వచ్చినట్లు సమాచారం. అంటే నెతన్యాహు కూటమి ఇంకా 7 సీట్ల దూరంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ కూటమికి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, కీలక నిర్ణయాత్మక శక్తిగా అరబ్ నేతృత్వంలోని పార్టీలు అవతరించే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో అరబ్ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.

Israel Elections Results Benjamin Netanyahu Suffers Setback Accuses Arab Parties of Vote Theft

అరబ్ పార్టీలపై సంచలన ఆరోపణలు
ఎన్నికల ప్రక్రియపై నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. అరబ్ పార్టీలు అవినీతి, బెదిరింపులు, భౌతిక దాడులు, నిషేధిత సాఫ్ట్‌వేర్లను ఉపయోగించి ఓటింగ్‌ను ప్రభావితం చేశాయని ఆరోపించింది. ఓటర్లను ఆకర్షించేందుకు నగదుతో కూడిన వేలాది కవర్లను, రామ్(Raam) పార్టీ బ్యాలెట్లను పంపిణీ చేశారని వెల్లడించింది. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు, ఆధారాలను దర్యాప్తు అధికారులకు సమర్పిస్తున్నట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.

Exit Polls: కాబోయే ప్రధాని ఎవరు? నెతన్యాహు ఔట్? 1999 తర్వాత అత్యధిక పోలింగ్.
Exit Polls: కాబోయే ప్రధాని ఎవరు? నెతన్యాహు ఔట్? 1999 తర్వాత అత్యధిక పోలింగ్.

పోలింగ్ అధికారులపై బెదిరింపులు
ఓటింగ్ ప్రారంభమైన మంగళవారం నుంచే నెతన్యాహు ఈ ఆరోపణలు చేయడం ప్రారంభించారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన ఘటనలపై సెంట్రల్ ఎలక్షన్ కమిటీ డైరెక్టర్ జనరల్ డీన్ లివ్నే స్పందిస్తూ.. ఇవి అసాధారణ పరిణామాలు అని వ్యాఖ్యానించారు. పోలీసులు ఓటింగ్ ప్రారంభానికి ముందే లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన పలువురు అనుమానితులను అరెస్ట్ చేశారని.. వారి వద్ద నుంచి వేలాది కవర్లు, దాదాపు 24,000 షెకెళ్లను స్వాధీనం చేసుకున్నారని ధ్రువీకరించారు.

రాజకీయ సమీకరణాలిలా..
ఎన్నికల ప్రచారం అంతటా నెతన్యాహు అరబ్ పార్టీల ఉనికిని ప్రధానంగా ప్రస్తావిస్తూ.. తమ మద్దతుదారులను పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో ఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో తదుపరి ప్రభుత్వం ఏర్పాటుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇదిలా ఉండగా.. అరబ్ పార్టీలతో పొత్తు పెట్టుకొనే ప్రసక్తే లేదని నెతన్యాహు తేల్చి చెప్పడంతో పాటు వారితో కలిసి పనిచేయబోనని స్పష్టం చేశారు. అరబ్బుల భాగస్వామ్యంతో వచ్చే ప్రభుత్వం ప్రమాదకరం అవుతుందని పేర్కొన్నారు. నెతన్యాహు ప్రధాన ప్రత్యర్థి ఐసెన్‌కోట్ కొన్ని షరతులకు లోబడి అరబ్ పార్టీలతో భాగస్వామ్యానికి తలుపులు తెరిచి ఉంచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+