గాజాపై ఇజ్రాయెల్ మెరుపుదాడులు- హమాస్ సీనియర్ కమాండర్ హతం

గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. గాజా దక్షిణ ప్రాంతంలోని ఖాన్ యూనిస్ సిటీని లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో హమాస్ సీనియర్ కమాండర్ సమీర్ అబు యూనిస్ మరణించాడు. ఈ తాజా దాడులతో.. గత ఏడాది అక్టోబర్ లో ఈ రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడినట్టయింది. ఈ ఒప్పందం కుదిరిన తర్వాత చోటు చేసుకున్న మొట్టమొదటి దాడి ఇదే కావడం, హమాస్ సీనియర్ కమాండర్ మరణించడం.. ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ ఘటనతో గాజా సరిహద్దుల్లో మరోసారి తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఖాన్ యూనిస్‌లోని అల్ మవాసీ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఈ దాడిని చేపట్టింది. అబు యూనిస్ నివాసం ఉండేది ఈ ప్రాంతంలోనే. అతన్ని మట్టుబెట్టాలనే ఉద్దేశంతోనే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వైమానిక విరుచుకుపడింది. అతను ఉన్న ప్రదేశంపై పక్కా దాడులను నిర్వహించింది.

Israel had struck a senior commander in Rafah brigade Hamas armed wing Samir Abu Younis South Gaza

ఈ ఘటనలో 53 ఏళ్ల సమీర్ అబు యూనిస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దాడి జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న పలువురు స్థానికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని అటు ఐడీఎఫ్ ధృవీకరించింది. అటు హమాస్ కూడా స్పందించింది. ఆర్మ్డ్ విభాగానికి చెందిన సీనియర్ కమాండర్ అబు యూనిస్ మరణించినట్లు వెల్లడించింది. ఆయన అంత్యక్రియలను ఈ సాయంత్రం ఖాన్ యూనిస్‌లోనే నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.

బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం: ఏపీలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం: ఏపీలో భారీ వర్షాలు

సమీర్ అబు యూనిస్.. హమాస్ ఆయుధ విభాగం అల్ ఖస్సామ్ బ్రిగేడ్స్‌లో సుదీర్ఘకాలంగా కీలక బాధ్యతలు నిర్వహించాడు. 1991 నుంచి ఈ సంస్థలో క్రియాశీల సభ్యుడిగా ఉన్న అతను.. రఫా బ్రిగేడ్ కమాండర్‌గా అనేక వ్యూహాత్మక సైనిక చర్యలకు నాయకత్వం వహించాడు. దక్షిణ గాజా సరిహద్దుల్లో హమాస్ స్థావరాలను బలోపేతం చేయడం, రఫాలో సుదీర్ఘ కాలం పాటు సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించడం అబు యూనిస్ కీలకంగా వ్యవహరించాడు.

తిరుమల రూ. 300 దర్శనం, వసతి గదుల బుకింగ్ వివరాలు
తిరుమల రూ. 300 దర్శనం, వసతి గదుల బుకింగ్ వివరాలు

నిజానికి.. గత ఏడాది అక్టోబర్ లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి శాంతి నెలకొనలేదు. హమాస్ తన ఆయుధ సంపత్తిని వీడకపోవడం, నిరాయుధీకరణ ప్రక్రియ కొలిక్కి రాకపోవడం వల్ల ఈ ఒప్పందం ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఖాన్ యూనిస్ సిటీపై ఇజ్రాయెల్ తాజా వైమానిక దాడులో ఇది పరాకాష్టకు చేరినట్టయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+