Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 104 మంది మృతి, 250 మందికి గాయాలు !!

ఇజ్రాయెల్ - హమాస్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మరోసారి బ్రేక్ అయ్యింది. ఈ ఒప్పందం అక్టోబర్ 10న అమల్లోకి వచ్చినప్పటికీ.. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాలస్తీనా మిలిటెంట్లు తమ సైనికుడిని చంపారన్న ఆరోపణలతో ఇజ్రాయెల్ తిరిగి గాజాపై బాంబుల వర్షం కురిపించింది. బుధవారం రాత్రి జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం 104 మంది పౌరులు మరణించగా.. 250 మందికి పైగా గాయాలైనట్లు గాజా ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు.

కాగా మరణించిన వారిలో మధ్య గాజాలోని బురీజ్ శరణార్థి శిబిరంలోని ఒక ఇంట్లో ఐదుగురు, గాజా నగరంలోని సబ్రా ప్రాంతంలో నలుగురు, ఖాన్ యూనిస్‌లో ఒక కారులో ఐదుగురు ఉన్నారు. ఈ దాడులు సురక్షిత ప్రాంతాలు, నివాసాలపై జరిగాయని హమాస్ ఆరోపించింది. మరణించిన పాలస్తీనియన్ల అంత్యక్రియల్లో గాజా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

israeli-airstrikes-on-gaza-leads-to-104-civilians-death

ఇజ్రాయెల్ వాదన..

పాలస్తీనా మిలిటెంట్లు తమ సైనికుడిని చంపిన తర్వాతే తాము దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. మిలిటెంట్లు ఒప్పందంలో ఉన్న "ఎల్లో లైన్" (మోహరింపు సరిహద్దు) లోపల ఉన్న తమ బలగాలపై దాడి చేసి, కాల్పుల విరమణను స్పష్టంగా ఉల్లంఘించారని ఇజ్రాయెల్ సైనిక అధికారి తెలిపారు. "ఏ ఉల్లంఘన"కైనా గట్టిగా స్పందిస్తామని సైన్యం ఒక ప్రకటనలో హెచ్చరించింది.

హమాస్ కౌంటర్..

ఇజ్రాయెల్ సైనికుడిని చంపిన దాడికి తాము బాధ్యత వహించబోమని హమాస్ నిరాకరించింది. కాల్పుల విరమణకు తాము కట్టుబడి ఉన్నామని, కానీ ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా పౌరులపై దాడులు చేస్తోందని ఆరోపించింది.

ఇజ్రాయెల్ దాడులు జరుగుతున్నప్పటికీ, కాల్పుల విరమణ ఒప్పందం "ప్రమాదంలో లేదు" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇజ్రాయెల్ సైనికుడి మరణాన్ని ప్రస్తావిస్తూ.. ఒక ఇజ్రాయెల్ సైనికుడిని చంపారు. కాబట్టి ఇజ్రాయెల్‌లు తిరిగి దాడులు చేశారు. వారు అలా చేయాలి" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. హమాస్ మధ్యప్రాచ్య శాంతిలో చిన్న భాగమని, మర్యాదగా ప్రవర్తించాలని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+