బీరుట్ పై ఇజ్రాయల్ భారీ దాడి - వారసుడిపై గురి..!!
లెబనాన్ రాజధాని బీరుట్ పై భారీ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయిల్ వైమానిక దాడిలతో బెంబేలెత్తిస్తుంది. హిజ్బుల్లా సంస్థ అధినేత హసన్ నస్రల్ల మరణం తర్వాత వారసుడిగా భావిస్తున్న హసీం సహిద్దిన్ లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత దాడుల పైన ఐడిఎఫ్ ఇంతవరకు స్పందించలేదు. అషీమ్ ఒక అండర్ గ్రౌండ్ లోని బంకల్లో దాచుకున్నట్లు గుర్తించి ఈ దాడులు చేసినట్లు సమాచారం.
సీనియర్ హిజ్బుల్లా నేతలతో సమావేశంలో ఉండగా గురి చూసి ఈ దాడులు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ దాడిలో అషీమ్ గాయపడ్డారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం హషీం హిస్బుల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హెడ్ గా ఉన్నారు. నస్రాల్లా కు హసీం దగ్గర బంధువు. 2017లో అతన్ని అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది. నస్రల్ల మరణం తర్వాత అతడికే అందినట్లు ప్రచారం జరిగింది. కానీ తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని సంస్థ ప్రకటించింది.

బీరుట్ విమానాశ్రయ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున వరుసగా భారీ పేలుళ్లు దుబాయ్ నుంచి వచ్చిన ఓ విమానం ల్యాండ్ అయిన కొద్ది క్షణాలకే ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. అయితే ఈ పేలుళ్లకు సంబంధించి జరిగిన నష్టం వివరాలను ఇంకా వెల్లడించలేదు. కాగా, ఇజ్రాయిల్ దాడిలో మరణించిన నస్రల్ల అంత్యక్రియలు ఈరోజు నిర్వహించనున్నారు. ఇందుకోసం బీరుట్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. దాడికి ప్రతీకారంగా ఇరాన్ రెండు రోజుల క్రితం 200 బాలిస్టిక్ మిస్సైలతో విరుచుకుపడింది. దీంతో పశ్చిమ ఆసియా లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితుల పైన భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమీక్షకు నిర్ణయించారు.












Click it and Unblock the Notifications