మిషన్ మోదీ సక్సెస్: జట్టు కట్టిన ఇస్రో-నాసా: జాయింట్ ప్రాజెక్ట్

వాషింగ్టన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తలపెట్టిన అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి లాన్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ఆయన అక్కడి నుంచి నేరుగా వాషింగ్టన్‌కు చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్‌లో ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు.

ప్రస్తుతం మోదీ చేపట్టిన అమెరికా పర్యటన సత్ఫలితాలను అందిస్తోంది. ఆయన అమెరికాలో ఉండగానే.. భారత్‌పై పలు వరాలను కురిపించింది అగ్రరాజ్యం. భారత్‌లో కొత్తగా కాన్సులేట్లను ఏర్పాటు చేయబోతోన్నట్లు ప్రకటించింది. తొలిదశలో రెండు నగరాలను ఎంపిక చేసింది. ఇందులో ఒకటి- బెంగళూరు. సిలికాన్ సిటీగా గుర్తింపు పొందిన బెంగళూరులో కొత్తగా కాన్సులేట్‌ను ఏర్పాటు చేస్తామని వైట్‌హౌస్ వెల్లడించింది. రెండో కాన్సులేట్‌ను ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది ఇంకా తెలియరావట్లేదు.

 isronasa

అదే సమయంలో మరో ప్రకటన వెలువడించింది వైట్ హౌస్. భారత్- అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థలు ఇస్రో, నాసా జట్టు కట్టినట్లు తెలిపింది. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు ఇకపై జాయింట్‌గా ప్రాజెక్టులను పంపించనున్నట్లు పేర్కొంది. నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్ ఒప్పందాలపై ఈ రెండు దేశాలు సంతకం చేసినట్లు వివరించింది.

1967 నాటి యూఎస్ ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం- 21వ శతాబ్దంలో పౌర అంతరిక్ష అన్వేషణలో భాగంగా నాసా ఆర్టెమిస్ మిషన్‌ను చేపట్టాల్సి ఉంటుంది. ఈ మిషన్‌ను ఇదివరకే ప్రయోగించింది కూడా. 2025 నాటికి మనుషులను చంద్రుడి పైకి పంపించాలనేది దీని ప్రధాన లక్ష్యం. అంగారక గ్రహంపైనా మనుషులను పంపించేలా ఈ స్పేస్ ట్రీటీల్లో ఆ తరువాత అమెరికా సవరణలు చేపట్టింది. ఆర్టెమిస్ ఒప్పందాలను 2020లో నాసా ప్రతిపాదించింది.

ఇటు ఇస్రో కూడా ఇప్పటికే చాంద్రయాన్ వంటి మిషన్‌లను చేపట్టింది. మానవ సహిత ప్రయోగానికీ శ్రీకారం చుట్టింది. ఇకపై ఈ మిషన్‌లో నాసా కూడా తోడవుతుంది. ఈ సంవత్సరం నుంచే ఈ ఒప్పందాలు అమలు కానున్నాయని వైట్ హౌస్ వెల్లడించింది. నాసా-ఇస్రో మానవ అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన స్ట్రాటజిక్ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తాయని వైట్ హౌస్ స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+