వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశీ భాషలు రావాలంటే మందేయాల్సిందే

By Narsimha
|
Google Oneindia TeluguNews

లండన్: పరిమిత స్థాయిలో మద్యం సేవించేవారిలో విదేశీ భాషలో మాట్లాడే సామర్థ్యం మెరుగవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. నెదర్లాండ్‌లోని మాస్ట్రిచ్‌ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఆఫ్‌ లివర్‌పూర్, లండన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొన్నారని సమాచారం.

ఇందులో భాగంగా ఇటీవల డచ్‌ నేర్చుకున్న 50 మంది జర్మన్లను ఎంపిక చేశారు. ఒక్కొక్కరి శరీర బరువును బట్టి మద్యం డోస్‌ను నిర్ధారించారు.ఈ అభ్యర్థుల భాషా ప్రావీణ్యాన్ని గుర్తించేందుకు ఇద్దరు డచ్‌ పౌరుల్ని ఎంపిక చేశారు.

It's True: Alcohol Helps You Speak a Foreign Language Better

అంతేకాకుండా తమ భాషా నైపుణ్యానికి మార్కులు ఇచ్చుకోవాల్సిందిగా అభ్యర్థులకు పరిశోధకులు సూచించారు. అయితే ఈ వ్యక్తులు మద్యం సేవించిన విషయాన్ని మాత్రం ఇద్దరు డచ్‌ పరిశీలకులకు తెలియజేయలేదు.

పరిమిత స్థాయిలో మద్యం సేవించిన వ్యక్తులు మద్యం తాగని వారితో పోల్చుకుంటే డచ్‌ భాషను మాట్లాటడంలో ఎంతో మెరుగ్గా వ్యవహరించారని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే మద్యం సేవించడం వల్ల భాషలో ప్రావీణ్యం సంపాదించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అయితే భాష నేర్చుకొనేందుకు మద్యం అలవాటు మాత్రం చేసుకోకండి.

English summary
Those who dabble in learning a new language sometimes find that alcohol — in moderation — helps them speak more fluently. In a way, that makes sense: It’s been shown that a beer or a glass of wine can lower inhibitions, which may make it easier for some people to overcome nervousness or hesitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X