తిరగబడిన ఉరి సీన్: కోమాలోకి వెళ్లిన హీరో
ఇటలీ : నాటకంలో వేదికపై ఉరి సీన్‌లో నటిస్తుండగా ఇటలీలో హీరోకు ప్రమాదవశాత్తు ఉరి బిగిసుకుంది. దీంతో అతను కోమాలోకి వెళ్లిపోయాడు. క్లైమాక్స్ అదిరిపోవాలనే ఉద్దేశంతో కావచ్చు, అతను మరణించే దృశ్యాన్ని మార్చేసుకున్నాడు.
స్టేజీ మీద ఆ సీన్‌లో ఆకట్టుకున్నాడు గానీ చివరకు ఆ హీరో కోమాలోకి వెళ్లిపోయాడు. ఇటలీలోని పీసా నగరంలో జరిగిన ఓ నాటక ప్రదర్శనలో ఈ విషాదం చోటుచేసుకుంది. 27 ఏళ్ల రాఫెల్ షూమాకర్ ఓ నాటక ప్రదర్శనలో కీలక పాత్ర పోషించాడు. ఆ ప్రదర్శన క్లైమాక్స్ లో సుసైడ్ సీన్ ఉంటుంది. అయితే ఆ సీన్‌లో హీరో ఉరి వేసుకుంటాడు.

ఉరి వేసుకున్న సమయంలో హీరో రాఫెల్ ఇబ్బంది పడ్డాడు. ఆ దృశ్యాన్ని తిలకిస్తున్న ఓ ప్రేక్షకుడు హీరో పరిస్థితిని గుర్తించాడు. హుటాహుటిన ఆ ప్రేక్షకుడు స్టేజ్ మీదకు వచ్చి హీరో మెడను చుట్టేసిన ఉరి తాడును తొలిగించాడు. కానీ అప్పటికే హీరో గొంతు ఉరి తాడుతో బిగుసుకుపోయింది. ఆక్సిజన్ అందకు ఇబ్బందిపడ్డాడు.
వెంటనే ఆ యాక్టర్‌ను హాస్పటల్‌కు తరలించారు. హీరో ప్రస్తుతం కోమాలో ఉన్నట్లు ఇటలీ అధికారులు తెలిపారు. తనకు తెలియకుండానే సుసైడ్ స్క్రిప్ట్‌ను మార్చినట్లు ఆర్ట్ డైరక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాస్తవానికి సుసైడ్ సీన్‌లో హీరో పిస్తోల్‌తో ఆత్మాహత్య చేసుకోవాల్సి ఉందని అన్నాడు.












Click it and Unblock the Notifications