కోడలుకు మరో పెళ్లిపై డొనాల్డ్ ట్రంప్ మాజీ భార్య స్పందన
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌కు వానెస్సా ట్రంప్ విడాకులు ఇచ్చింది. దీనిపై డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ స్పందించారు.
తన కోడలు వానెస్సా ట్రంప్‌కు మరో పెళ్లి చేయడం తనకు కష్టమేనని చెప్పారు. ఇప్పటికే ఆమెకు ఐదుగురు పిల్లలు ఉన్నారని, ఆ తల్లిని ఎవరు పెళ్లి చేసుకుంటారని వ్యాఖ్యానించారు.

జూనియర్ ట్రంప్ చూడడానికి బాగుంటాడని, అతను అన్నింటా విజయం సాధించాడని, తనకు మరో అమ్మాయి మాత్రం కచ్చితంగా దొరుకుతుందని చెప్పారు. కానీ ఐదుగురు పిల్లలు ఉన్నందున కోడలు వానెస్సాకు మాత్రం మరో పెళ్లి అంత సులువు కాదన్నారు.
జూనియర్ ట్రంప్ ఎప్పటి నుంచో వానెస్సాకు తెలియకుండా మోసం చేస్తున్నాడని, ఆమెకు ఈ విషయం ఇప్పుడే తెలిసిందని, తట్టుకోలేకపోతోందని, క్షమించలేకపోతోందని చెప్పారు.












Click it and Unblock the Notifications