ఒబామా కూతురు మలియాకు ట్రంప్ కూతురు ఇవాంకా సపోర్ట్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియా ఒబామాకు మద్దతుగా నిలిచారు ప్రస్తుత అధ్యక్ష, మాజీ అధ్యక్షుల కుమార్తెలు ఇవాంకా ట్రంప్, చెల్సియా. మలియా ఒబామా పొగ తాగుతున్నట్లు, ఓ యువకుడిని ముద్దాడుతున్నట్లు ఉన్న ఫొటోలు ఇటీవల కొన్ని ప్రతికలు, మీడియాల్లో ప్రచురితమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆమెపై పలు మీడియాల్లో వార్తులు దుమారం రేపాయి. దీంతో మలియాకు వ్యక్తిగత జీవితం ఉంటుందని, అది మీడియాకు అనవసరమని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కుమార్తె చెల్సియా అన్నారు.
సాధారణంగా అధ్యక్షులు, మాజీ అధ్యక్షుల పిల్లల వ్యక్తిగత జీవితాలపై వార్తలు ఇచ్చేందుకు అక్కడి మీడియా దూరంగా ఉంటుంది. అయితే మలియా విషయంలో అలా జరగకపోవడంతో ఇవాంకా ట్రంప్, చెల్సియా క్లింటన్ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు.

'మలియా ఒబామా ఇప్పుడు ఒక ప్రైవేటు సిటిజన్. ఆమె జీవితానికి ప్రైవసీ ఉంటుంది. మీడియా పరిమితుల్లో ఉండాల్సిన అవసరం ఉంది' అని ఇవాంకా ఘాటుగా ట్వీట్ చేశారు. ఇక చెల్సియా కూడా మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఒక యువతిగా, కాలేజీ విద్యార్థిగా, ప్రైవేట్ సిటిజన్‌గా మలియా ఒబామాకు వ్యక్తిగత జీవితం ఉంటుంది.అది మీడియా ప్రజల దృష్టిని ఆకర్షించడానికి కాదు. కాస్త ఉన్నతంగా ఉండండి' అని చెల్సియా మీడియాకు హితవు పలికారు. వీరి ట్వీట్లకు భారీ సంఖ్యలు నెటిజన్లు మద్దతు పలుకుతున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications