వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇవాంక స్పెషల్ క్వాలిటీస్: తండ్రినే కంట్రోల్ చేస్తోంది...

హైదరాబాద్ పర్యటనకు ఇవాంక ట్రంప్ రావడానికి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో ఆమె పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ప్రపంచాన్ని కూడా లెక్క చేయని డోనాల్డ్ ట్రంప్‌ను ఆమె నియంత్రిస్తోందట.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ పర్యటనకు ఇవాంక ట్రంప్ రావడానికి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో ఆమె పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ప్రపంచాన్ని కూడా లెక్క చేయని డోనాల్డ్ ట్రంప్‌ను ఆమె నియంత్రిస్తోందట. తల్లికి విడాకులు ఇచ్చినా తండ్రికి ఆమె మద్దతు ఇస్తూ వస్తోంది.

ప్రపంచాన్ని నడిపించే ఆమెరికా దేశాధ్యక్షుడికి శక్తివంతమైన సలహాలు ఇచ్చే మహిళగా ఆమె గుర్తింపు పొందింది. ఆమెకు బాద్యతలు, హోదా కేవలం డోనాల్డ్ ట్రంప్ వల్ల వచ్చినవి మాత్రమే కాదని అంటున్నారు. అమెరికా అధ్యక్షుడికి సలహాదారుగా ఉండే అన్ని అర్హతలు ఆమె సంతరించుకుంది.

ఇవాంక తండ్రి ట్రం్ విడాకులిచ్చిన మొదటి భార్య కూతురు. అయినా ఆమె ఇప్పుడు శ్వేతసౌధంలో చక్రం తిప్పుతోంది. ఇవాంక తల్లి ఇవానాకు విడాకులిచ్చిన తర్వాత ట్రంప్ మేపుల్స్‌‌ను రెండో పెళ్లిచేసుకున్నారు. ఆమెకు కూడా విడాకులు ఇచ్చేసి మొలానియాను మూడో వివాహం చేసుకున్నారు. అయినా కూడా ఆయనకు మొదటి భార్య కూతురు ఇవాంకపై ఎనలేని అనురాగం.

Recommended Video

Ivanka Trump in Hyderabad : Security beefed up in Hyderabad
అప్పుడే విడాకులు...

అప్పుడే విడాకులు...

డొనాల్డ్ ట్రంప్, ఇవానా 1991లో విడాకులు తీసుకున్నారు. అప్పటికి ఇవాంక వయసు పదేళ్ళు. ఆమెకు 15ఏళ్లు వచ్చేవరకూ మన్ హట్టన్‌లో విద్యనభ్యసించారు. ఆ తర్వాత కనెక్టికట్‌లోని బోర్డింగ్ స్కూల్లో చేరారు. చోయేట్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఇవాంక 2004లో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఎకనమిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు.

అ తర్వాత మోడలింగ్...

అ తర్వాత మోడలింగ్...

పద్నాలుగేళ్ల వయస్సులోనే ఇవాంక మోడలింగ్‌లో ప్రవేశించారు. అలా ప్రవేశిచిన ఆ ఏడాదిలోనే ప్రముఖ మ్యాగజైన్స్‌లో ఆమె ఫొటోలు అచ్చయ్యాయి. దాంతో ఇవాంక పాపులర్ అయ్యారు. అప్పటికే యాడ్ ఫిల్మ్స్‌లో నటించి యూత్ కి బ్యూటీ ఐకాన్ గా మారారు.

ఫ్యామిలీ బిజినెస్

ఫ్యామిలీ బిజినెస్

డిగ్రీ పూర్తి చేసిన తర్వాే 20ఏళ్ల వయస్సులో ఫ్యామిలీ బిజినెస్‌‌లో అడుగుపెట్టారు. తొలుత డైమండ్ బిజినెస్, తర్వాత బంగారు ఆభరణాల వ్యాపారం చేశారు. బట్టలతో పాటు యాక్సెసరీస్‌కు కూడా రూపకల్పన చేశారు.ఇవాంక పేరుతోనే షూస్, జ్యుయలరీతో పాటు హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్‌ను మార్కెట్లోకి వచ్చాయి. 2015 లోనే వంద మిలియన్ డాలర్లను బిజినెస్‌లో సంపాదించారు. చైనాలో కూడా ఇవాంక కలెక్షన్స్‌కు కాసుల వర్షం కురిసింది. ఇప్పటికీ ఆమె బిజినెస్ చైనాలో విజయవంతంగా నడుస్తోంది.

తండ్రి వ్యాపారాలు కూడా.

తండ్రి వ్యాపారాలు కూడా.

ఫ్యాషన్ రంగంలోనే కాకుకుండా తండ్రి డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన పలు వ్యాపారాలను ఆమె చూస్తూ వచ్చారు. లిక్కర్ బిజినెస్‌తో పాటు గోల్ఫ్స్ క్లబ్స్, రిసార్ట్స్, హోటల్స్ లాంటి బిజినెస్‌లను ఇవాంక నడిపారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్యాపారాల నుంచి డొనాల్డ్ ట్రంప్ తప్పుకున్నారు. ఆ సమయంలో కొన్నాళ్ళు ఇవాంకే ఈ బాధ్యతలన్నీ ఇవాంక చూసుకున్నారు. ఆ తర్వాత వైట్ హౌస్‌లో సలహాదారుగా చేరారు.

దాపరికం లేకుండా...

దాపరికం లేకుండా...

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇవాంక తండ్రి విజయం కోసం ప్రచారం చేశారు. అయితే తన అభిప్రాయాలను ఏమాత్రం దాచుకోకుండా వెల్లడించారు. ఒక పౌరురాలిగా ఆయన చేస్తున్న పనిని నేను ఇష్టపడతాను గానీ ఒక కూతురిగా ఇది ఆయనకు కష్టమైన విషయంగా భావిస్తానని ఇవాంక అన్నారు.

తండ్రి ప్రతిభ గురించి....

తండ్రి ప్రతిభ గురించి....

తన తండ్రిలో ఉన్న అత్యంత గొప్పవైన నైపుణ్యాలలో ఒకటి ఏంటంటే మనుషుల్లోని సామర్థ్యాలను ఇట్టే పట్టేస్తారని, అమెరికాను ఆయన మళ్లీ ఒక గొప్ప దేశంగా మార్చేయగలరని రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థుల సమావేశంలో ఇవాంక చేసిన వ్యాఖ్యలను వాషింగ్టన్‌ పోస్ట్‌ ప్రముఖంగా ప్రచురించింది. దానికితోడు ఇవాంక వైట్‌హౌస్‌లో ఉన్నంత వరకే అమెరికా గానీ, మిగతా దేశాలు గానీ ట్రంప్‌ చేతుల్లో సురక్షితంగా ఉంటాయని ఆ పత్రిక భావించడం గొప్ప విషయం.

పర్యవేక్షణ ఆమెదే...

పర్యవేక్షణ ఆమెదే...

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తీసుకునే నిర్ణయాలను, ఆయన ప్రసంగాలను, ప్రకటనలను ఎప్పటి కప్పుడు ఇవాంక పర్యవేక్షిస్తారు. అందుకు అవసరమైన గణాంకాలు, ఇతర ఆధారాలు సమకూర్చి ఆ ప్రసంగాలకు మరింత సమగ్రతను ఇవాంక జట్టు చేకూరుస్తుంది. ఎవరినీ లెక్క చేయని ట్రంప్ ఇవాంక మాట మాత్రం వింటారట.

English summary
Ivanka Trump, coming for Hyderabad tour is having special qualities in controling US president Donald trump.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X