శృంగారం శృతిమించితే: వేటు పడింది (వీడియో)
లండన్: లోదుస్తుల తయారీదారు జాక్ విల్స్ కంపెనీ తన బ్రాండ్స్‌ను మార్కెటింగ్ కోసం రూపొందించిన వీడియో ప్రకటన ఇబ్బందులు పాలు చేసింది. కొంత మంది యువతులు యువకులతో రూపొందించిన ఈ వాణిజ్య ప్రకటనతో ఏకంగా ఆ కంపెనీ నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
జాక్ విల్స్ కంపెనీ రూపొందించిన ఈ వాణిజ్య ప్రకటనలో శృతిమించిన లైంగిక దృశ్యాలు ఉండటంతో పాటు యువతను పెడదోవ పట్టించే విధంగా ఉంది. దీంతో ఆ సంస్ధ రూపొందించిన బ్రాండ్స్‌పై అధికారులు నిషేధాన్ని విధించారు.
వివరాల్లోకి వెళితే... జాక్ విల్స్ అనే సంస్థ యువతీ యువకులకు కావాల్సిన లోదుస్తులను తయారు చేస్తుంది. ఇందులో అండర్ వేర్స్, ఇన్నర్ వేర్స్ లాంటివి ఉన్నాయి. తాజాగా జాక్ విల్స్ తయారు చేసిన ఈ బ్రాండ్స్ కోసం కొంతమంది యువతీ యువకులతో ఓ వాణిజ్య ప్రకటనను వీడియో రూపంలో విడుదల చేశారు.

ఈ ప్రకటనలో కంపెనీకి చెందిన అండర్ వేర్స్, బనియన్స్ ధరించిన యువతీ యువకులు ఒకే దుప్పటి కింద మంచంపై దొర్లుతున్నారు. ఈ సమయంలో కెమెరా జాక్ విల్స్ అండర్ వేర్‌ను ప్రముఖంగా చూపించడం, ఆ తర్వాత మత్తుపానీయాలు సేవిస్తున్నప్పుడు, డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఒంటిపై దుస్తులు లేకుండా బనియన్స్, అండర్ వేర్స్‌తో మోడల్స్ ఉన్నారు.
అంతేకాదు ఈ వీడియో మొత్తం అసభ్యంగా ఉండటంతో ఈ బ్రాండ్‌ను లండన్ అధికారులు నిషేధించారు. ఈ నిషేధంపై స్పందించిన జాక్ విల్స్ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ కేవలం 18 సంవత్సరాల నుంచి 24 ఏళ్ల లోపు ఉన్న వర్సిటీ విద్యార్ధులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రకటనను రూపొందించామని చెప్పారు.
అంతేకాదు తాము రూపొందించిన వాణిజ్య ప్రకటనలో కూడా అసభ్యత లేదని పేర్కొన్నారు. కేవలం కొంతమంది ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ద అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎఎస్ఎ) సూచనల మేరకే దానిని రూపొందించామని తెలిపారు.












Click it and Unblock the Notifications