భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. చర్చలు అంటూనే ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పై దాడులకు పాల్పడుతోంది అమెరికా. ఇరాన్ సైతం ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్- అమెరికా మధ్య సంధి చర్చలను ప్రారంభించేందుకు పాకిస్థాన్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్- అమెరికా మధ్య పాకిస్థాన్ వైఖరిపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్.. పాకిస్థాన్ లాగా 'బ్రోకర్' పాత్ర పోషించదని స్పష్టం చేశారు. తాజాగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా పాకిస్తాన్, టర్కీ వంటి పలు దేశాలు మధ్యవర్తిత్వానికి నిలిచిన నేపథ్యంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 1981 నుండి అమెరికా.. పాకిస్థాన్ ను ఉపయోగించుకుంటోంది.. కాబట్టి పాకిస్థాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కొత్తేమీ కాదని జైశంకర్ అన్నట్లు పీటీఐ వర్గాలు తెలిపాయి. మధ్యప్రాచ్య సంక్షోభంపై తాజాగా అఖిలపక్ష సమావేశం జరిగింది. పశ్చిమాసియా యుద్ధం అన్ని పక్షాలను ప్రభావితం చేస్తున్నందున అది త్వరగా ముగించాలని ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు చెప్పారని ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులకు వివరించింది. ఉద్రిక్తతలను తగ్గించే వైఖరిని భారత్ పునరుద్ఘాటించింది.
సంక్షోభంపై దిల్లీ మౌనంగా ఉందన్న ప్రతిపక్ష విమర్శలను ఖండించిన ప్రభుత్వం.. "మేము మాట్లాడుతున్నాము.. స్పందిస్తున్నాము" అని బదులిచ్చింది. ఇరాన్ రాయబార కార్యాలయం ప్రారంభమైనప్పుడు విదేశాంగ కార్యదర్శి తక్షణమే సందర్శించి సంతాప పుస్తకంలో సంతకం చేసి, ఆలస్యమైన ప్రతిస్పందన ఆరోపణలను ఖండిస్తూ దౌత్యపరమైన కృషిని ప్రస్తావించారు.
గల్ఫ్ ప్రాంతంలోని భారతీయు భద్రత, దేశీయ ఇంధన భద్రతే తమ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం నొక్కి చెప్పిందని పీటీఐ వర్గాలు తెలిపాయి. మారుతున్న పరిస్థితుల మధ్య కూడా ఈ రెండు లక్ష్యాలను ఇప్పటివరకు సమర్థవంతంగా నిర్వహించగలిగామని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ ప్రతిస్పందనలు "అసంతృప్తికరంగా" ఉన్నాయని ప్రతిపక్షం అభివర్ణించి, పార్లమెంటులో వివరణాత్మక చర్చకు పట్టుబట్టింది. కాంగ్రెస్ నాయకుడు తారిక్ అన్వర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటే "మనం ఇప్పటికీ మౌనంగా చూస్తున్నాము" అని అన్నారు. లోక్‌సభలో నియమం 193, రాజ్యసభలో నియమం 176 కింద చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ నుండి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు కూడా పాల్గొన్నారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి ప్రజెంటేషన్ ఇచ్చారు. హాజరైన ప్రతిపక్ష నాయకులలో కాంగ్రెస్ నుండి తారిక్ అన్వర్, ముకుల్ వాస్నిక్, సమాజ్‌వాదీ పార్టీ నుండి ధర్మేంద్ర యాదవ్, బీజేడీ నుండి సస్మిత్ పాత్ర ఉన్నారు.
-
పాకిస్తాన్‌కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తోకముడిచిన ట్రంప్, అమెరికా పరువు తీసిన ఇరాన్ రియాక్షన్ -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
LPG Cylinder: సిలెండర్ 14.2 కేజీలే, గ్యాస్ 10 కేజీలు? కేంద్రం క్లారిటీ-అసలు ప్లాన్ ? -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
1970ల నాటి చీకటి రోజులు మళ్లీ: సంచలన హెచ్చరిక!












Click it and Unblock the Notifications