ఇంటికి భారం కాలేక.. నేరాలు చేసి జైలుకు వెళ్తున్న వృద్ధులు.. ఎక్కడంటే?
కని, పెంచి, పెద్దచేసిన తల్లిదండ్రులను కంటికిరెప్పలా చూసుకోవాల్సిన పిల్లలు కాదని గెంటేస్తే..? వృద్ధాప్యంలో ఏపనీ చేసే శక్తిలేక చివరకు చిన్న చిన్న దొంగతనాలు చేసి మరీ జైలుకు వెళ్తున్నారు వృద్ధులు. జైలులోనే తమకు రక్షణ ఉంటుందని భావించి.. జైలుకు వెళ్లడమే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. శిక్ష పూర్తయిందని బయటకు విడిచినా.. పిల్లల వద్ద ఉండి తిట్లు తినలేక.. మళ్లీ నేరాలు చేసి జైలుకు వెళ్తున్నారు అక్కడి వృద్ధులు. అవును వింటుంటే షాకింగ్ గా ఉన్నా.. ప్రస్తుతం జపాన్ లో వృద్ధులు చేస్తున్నది ఇదే..
జపాన్ దేశం పారిశ్రామికంగా, ఆర్థికంగా, టెక్నాలజీ పరంగా ఎన్నో దేశాలకంటే ముందుంది. రెండు అణుబాంబుల్ని తట్టుకుని మరీ అభివృద్ధిలో దూసుకెళ్తోంది ఆ దేశం. కానీ ప్రస్తుతం ఆ దేశాన్ని ఓ సమస్య తీవ్రంగా వెంటాడుతోంది. అదే వృద్ధాప్యం. ఇప్పుడు జపాన్ లో వృద్ధుల జనాభా పెరిగిపోయింది. యువత తగ్గిపోయింది. ఈ క్రమంలో జపాన్ లో వృద్ధుల సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలిపేందుకు ఈ సంఘటనే నిదర్శనం.

ఏం జరిగింది?
అఖియో అనే వృద్ధురాలికి 81 ఏళ్లు. ఆమెకు40ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఓరోజు కుమారుడు అఖియో కు షాకింగ్ మాట చెప్పాడు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోతే బాగుటుంది అన్నాడు. ఆ మాటలకు ఇల్లు వదిలి వచ్చిన అఖియోకు వృద్ధాప్యం కారణంగా ఏ పనీ చేయడానికి శక్తి లేదు. దీంతో ఏదైనా చిన్న దొంగతనం చేసి జైలుకు వెళ్లాలని అనుకుంది. అక్కడైతే తాను సురక్షితంగా బ్రతకొచ్చని భావించింది. ఓ షాపులో దొంగతనం చేసి టోక్యోలోని తొచిగి వుమెన్స్ ప్రిసన్ లో చేరింది. కొన్ని నెలల తర్వాత బయటకు వచ్చింది. అయితే మళ్లీ చిన్నపాటి దొంగతనం చేసి అదే జైలుకు వచ్చింది. అయితే ఇలా అఖియోనే కాదు ఆ మహిళా జైలులో ఉన్న 500 మందిలో అనేక మంది వృద్ధులు కావడం.. వారిలో చాలా మంది ఇలా రిలీజై.. అలా మళ్లీ జైలుకు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నా కొడుకు ఇంట్లోనుంచి గెంటేశాడు..
ఈ విషయంపై అఖియో మాట్లాడుతూ.. నా జీవితం స్థిరంగా ఉండి.. చేతినిండా డబ్బులుంటే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటా..? ఇదో సిల్లీ డెసిషన్ అని నాకు తెలుసు. కానీ నేను ఈ వయసులో ఏ పనీ చేయలేను. అందుకే ఇలా చేశా" అని చెప్పుకొచ్చింది. జైలులో చాలామంది మంచివ్యక్తులు ఉన్నారని.. బయటి ఉరుకుల పరుగుల జీవితం కంటే ఇక్కడే నా లైఫ్ స్థిరంగా ఉందని అఖియో పేర్కొంది.
" నా కొడుకు ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్నాడు. ఒంటరిగా సమాజంలో బతకడం చాలా కష్టం. తోడు ఉండాలి. జైలులో నాకు అది లభించింది. ఇది మహిళా జైలు కాబట్టి సౌలభ్యంగా ఉంది. నాకు దేవుడు మరో జన్మ ప్రసాదిస్తే..నేను మంచి హోదాలో జీవించగలనన్న గట్టి నమ్మకం నాకుంది" అని అఖియో చెప్పుకొచ్చింది.
వేలకు వేలు కట్టిమరీ ఇక్కడ ఉంటున్నారు..
జైలు అధికారి తకయోషి షిరనాగా దీనిపై స్పందించారు. అఖియో లాంటి ఎందరో ఒంటరి మహిళలకు ఈ జైలు నివాసం అయింది. కొంతమంది ధనికులు సైతం ఇక్కడకు డబ్బులు ఇచ్చి వస్తున్నారు. తమ పిల్లల వద్ద ఉండి తిట్లు తింటూ ఉండలేక.. నెలకు రూ. 20 వేల నుంచి 30వేలు ఇచ్చి మరీ ఇక్కడ ప్రశాంతంగా జీవిస్తున్నారు అని జైలు అధికారి షిరనాగా తెలిపారు.
పెరిగిన వృద్ధ జనాభా..
ప్రస్తుతం జపాన్ లో వృద్ధ జనాభా పెరిగిపోతోంది. దేశంలో 65ఏళ్ల పైబడినవాళ్లు దాదాపు 40 లక్షలమందికి పైగా ఉన్నారు.












Click it and Unblock the Notifications