రిజైన్: విచారణను ఎదుర్కొనేందుకు సిద్దమన్న మంత్రి
టోక్యో: జపాన్ మాజీ ప్రధాని కూతరు, ప్రస్తుతం ఆ దేశ కేబినెట్ మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్న యూకో ఒబుచి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామాకి కారణం ఓట్లు కొనుగోలు చేయడంతో పాటు మేకప్ కోసం చేసిన ఖర్చులే. పరిశ్రమలు, వాణిజ్యం, ఆర్థిక వ్యవహారాల మంత్రిగా యూకో ఒబుచి రాజీనామాకు ఆమోదం తెలిపారు ఆ దేశ ప్రధాని జపాన్ ప్రధాని షింజో.
ప్రధాని షింజోతో 30నిమిషాల పాటు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన యూకో ఒబుచి మాట్లాడుతూ "పరిశ్రమలు, వాణిజ్యం, ఆర్థిక వ్యవహారాల మంత్రిగా ఉన్న నేను నిధులను దుర్వినియోగం చేశాను. నా సొంత సమస్యల వల్లే ఇలా చేయాల్సి వచ్చింది. దీనికి బాధ్యతగా నా రాజీనామాని ప్రధానికి సమర్పించాను. దీనిపై విచారణను ఎదుర్కునేందుకు సిద్దం" అని అన్నారు.

జపాన్ ప్రధానిగా షింజో అబే కేబినెట్ లో పరిశ్రమలు, వాణిజ్యం, ఆర్థిక వ్యవహారాల మంత్రిగా ఆమె కీలక బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. జపాన్ ప్రధాని షింజో అబే కేబినెట్‌లో ఉన్న మహిళా మంత్రుల వల్ల తన ప్రభుత్వానికి సమస్యలు వస్తున్నాయంటూ జపాన్ మీడియా కోడై కూస్తుంది.












Click it and Unblock the Notifications