జపాన్ ప్రధాని కిషిదాకు తప్పిన ముప్పు: ప్రసంగ వేదిక సమీపంలో బాంబు పేలుడు

టోక్యో: జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా(Fumio kishida)కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన పాల్గొన్న ఓ కార్యక్రమ వేదికకు సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. అయితే, అధికారులు వెంటనే అప్రమత్తమై ప్రధానిని అక్కడ్నుంచి సురక్షితంగా తరలించారు. ఈ ఘటనలో ప్రధానికి ఎలాంటి హాని జరగలేదని అధికారులు వెల్లడించారు.

శనివారం వకయామలోని సైకాజకి పోర్టులో శనివారం ప్రధాని కిషిదా పర్యటించారు. అయితే, వేదికపై మరికాసేపట్లో ప్రధాని కిషిదా ప్రసంగం చేయాల్సి ఉండగా.. వేదికకు సమీపంలో పేలుడు చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడి పరుగులు తీశారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రధాని కిషిదాను వెంటనే అక్కడ్నుంచి సురక్షితంగా తరలించారు.

fumiokishida

ఘటనా స్థలం నుంచి ఓ యువకుడు పారిపోతుండగా భద్రతా సిబ్బంది అతడ్ని పట్టుకున్నారు. ఆ యువకుడే వేదికపైకి స్మోక్ బాంబు విసిరినట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పేలుడు ఘటనలో ఎవరికైనా గాయాలు అయ్యాయా? అనేది తెలియాల్సి ఉంది. అయితే, మరికొద్ది రోజుల్లో జీ-7 దేశాల మంత్రుల సమావేశాలు జపాన్‌లో జరగనున్న సమయంలో.. ఈ బాంబు దాడి ఘటన కలకలం రేపుతోంది.

ఇది ఇలావుండగా, జపాన్ మాజీ ప్రధాని షింజో అబే గత కొద్ది నెలల క్రితం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. 2022 జులైలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ కూడలి వద్ద ప్రజలనుద్దేశిస్తూ ప్రసంగిస్తుండగా.. ఓ దుండగుడు ఆయనకు అత్యంత సమీపంగా వచ్చి కాల్పులు జరిపాడు. దీంతో షింజో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+