సీరియల్ కిల్లర్ ఘాతుకం: ఆ అపార్ట్‌మెంట్‌లో తలలు, మొండాలే
జపాన్ దేశంలో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వరుస హత్యలకు పాల్పడుతున్న ఓ సీరియల్ కిల్లర్ తమ మధ్యే ఉన్నాడని తెలిసి టోక్యోలోని జమా ప్రాంత వాసులు హడలెత్తిపోయారు.
టోక్యో: జపాన్ దేశంలో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వరుస హత్యలకు పాల్పడుతున్న ఓ సీరియల్ కిల్లర్ తమ మధ్యే ఉన్నాడని తెలిసి టోక్యోలోని జమా ప్రాంత వాసులు హడలెత్తిపోయారు. అతనున్న అపార్ట్‌మెంట్‌లో తల, మొండాలు వేర్వేరుగా ఉన్న మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది.

యువతి మిస్
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. జమాలోని ఆ అపార్ట్‌మెంట్‌లో గత కొంత కాలంగా ఓ మహిళ ఒంటరిగా ఉంటోంది. అయితే గత పది రోజులుగా ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఇక కొన్నాళ్ల క్రితం హచియోజి ప్రాంతానికి చెందిన ఓ యువతి కనిపించకుండా పోయిందంటూ కేసు నమోదు కాగా, ఆ కేసు విచారణలో లభించిన ఆధారాలతో టోక్యో పోలీసులు సోమవారం సదరు మహిళ ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో సోదాలు నిర్వహించారు.

దిగ్భ్రాంతికి గురైన పోలీసులు
ఆ సమయంలో మహిళ ఇంట్లో లేకపోవటంతో తాళాలు పగలకొట్టి సోదాలు చేశారు.
ఓ కూలర్ బాక్స్‌లో ఉన్న రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత లోపలికి వెళ్లిన పోలీసులకు భయానక దృశ్యాలు దర్శనమిచ్చాయి. అక్కడ కొన్ని కూలర్ బాక్స్‌లలో తల, మొండాలు వేర్వేరుగా ఉన్న కొన్ని మృతదేహాలు వారి కంటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ మృతదేహాలన్నింటినీ స్వాధీపరుచుకున్న పోలీసులు.. అవి ఎవరివో గుర్తించే పనిలో పడ్డారు.

మృతదేహాల్లో 8మంది యువతులవే..
ఆ గదిలో మొత్తం 9 మృతదేహాలు(8మంది యువతులు, ఒక యువకుడి) లభ్యమైనట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా, ఆ గదిలో నివసించే మహిళ, తకహిరో షిరైషీ(27) అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు ఓ జపాన్ పత్రిక తన కథనం ప్రచురింది.

సీసీ కెమెరాల్లో మిస్సైన యువతితో నిందితుడు..
కాగా, మొదట మిస్సయిన యువతి సూసైడ్ నోట్ రాసి వెళ్లటం.. చివరిసారిగా ఓ రైల్వే స్టేషన్‌లో తకహిరోతో కలిసి కనిపించిన ఫుటేజీలు దర్శనమిచ్చింది. దీంతో ఈ కేసులో వేరే కోణాలు కూడా ఉన్నాయన్న అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారని ఆ పత్రిక కథనం లో పేర్కొంది. ఇంతమందిని ఎందుకు? ఎలా చంపారనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుల విచారణ పూర్తయితే తప్ప అసలు విషయం తెలిసే అవకాశం లేదు.












Click it and Unblock the Notifications