12 వేల మందితో సెక్స్: లక్షన్నర ఫొటోలు, అల్బమ్స్
టోక్యో: చిన్న పిల్లల నగ్న చిత్రాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై జపాన్‌లో ఒక మాజీ స్కూలు హెడ్మాస్టర్‌కు యోకోహామా జిల్లా కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించింది. యుహేయి తకషిమా అనే 65 ఏళ్ల ఆ హెడ్మాస్టర్ చరిత్ర చాలా పెద్దదే. దాదాపు 12వేల మందికి డబ్బులిచ్చి సెక్స్ చేశాడని పోలీసులు తెలిపారు.
తకషిమా సెక్స్ జరిపినవారిలో 14 ఏండ్ల బాలికలు కూడా ఉన్నారు. తకషిమా వద్ద ఉన్న నగ్న చిత్రాలు రెండేళ్ల క్రితం ఫిలిప్పీన్స్‌లోని ఒక హోటల్‌లో తీసినవని తీర్పును ఉటంకిస్తూ జపాన్ మీడియా తెలిపింది. ఆ ఫొటోల్లో ఉన్న బాలికలు 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్నవారే.

దాదాపు 27 ఏళ్ల కాలంలో అతను సెక్స్ జరుపుతుండగా సుమారు లక్షన్నర ఫొటోలు తీసుకుని, వాటితో 400 వేర్వేరు ఆల్బమ్‌లు తయారు చేయించాడని స్థానిక మీడియా తెలిపింది. అయితే జ్ఞాపకాలుగా దాచుకోడానికే ఫొటోలు తీశానని తనషిమా కోర్టులో చెప్పుకొన్నాడు. అతను 1988 నుంచి ఈ వ్యవహారం నడిపిస్తున్నాడు.
ఏటా మూడు సెక్స్‌టూర్లు పెట్టుకుని వివిధ దేశాలు సందర్శించేవాడు. ఇలా మొత్తం 65 పర్యటనలు చేసినట్టు విచారణలో వెల్లడైంది. ఈ సమయంలో దాదాపు 12వేల మందితో తకషిమా సెక్స్ చేశాడని, వారిలో 14 ఏళ్ల బాలికలు మొదలుకుని 70 ఏండ్ల వృద్ధురాళ్లు కూడా ఉన్నారని స్థానిక టీవీ ఒకటి తెలిపింది. బాలికల ఆర్థిక అవసరాలను ఉపయోగించుకుని ఈ దారుమణైన చర్యకు తకషిమా పాల్పడ్డాడని విచారణకు అధ్యక్షత వహించిన జడ్జి నవాకో ఒమోరి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications