వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సన్యాసులకు అందాల పోటీలు, కానీ భిన్నంగా..

|
Google Oneindia TeluguNews

టోక్యో: అమ్మాయిల అందాల పోటీలు మనకు తెలుసు. అబ్బాయిల హ్యాండ్‌సమ్ పోటీలను కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు సన్యాసులు కూడా అందాల పోటీలు నిర్వహించడం గమనార్హం. అయితే, ఈ పోటీ బాహ్య సౌందర్యానికి సంబంధించినది కాదు. లోపలి సౌందర్యం గురించి.

ఈ అంతర్లీన అందాల పోటీలు జపాన్‌లో జరిగాయి. ఇవి బౌద్ధ సన్యాసులకు జరిగాయి. సన్యాసుల్లో దాగి ఉన్న గొప్ప విషయాలను, మంచితనాన్ని తెలియజేసే ఉద్దేశ్యంతో ఈ పోటీలు నిర్వహించినట్లు చెప్పారు.

Japanese monks compete peacefully in Most Handsome Monks

ఇందులో భాగంగా విభిన్నమైన ప్రశ్నలు అడగటం, వాటి సమాధానాలు రాబట్టటం చేశారు. అంతేకాదు వారిలోని శక్తి సామర్థ్యాన్ని బయటపెట్టడానికి రాళ్లను పగలగొట్టడం, వివిధ భంగిమల్లో ఆసనాలు వేయించడం కూడా చేశారు.

ఈ పోటీలకు జపాన్‌లో సన్యాసుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఫైనల్‌ పోటీలకు అయిదుగురు అర్హత సాధించారు. అనంతరం వారి సామర్థ్యాలను బట్టి బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీలు నిర్వహించడం ఇది రెండోసారి. గత ఏడాది కూడా నిర్వహించారు.

English summary
Japanese monks compete peacefully in Most Handsome Monks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X