బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కన్నకూతురుపై తల్లి దారుణం

టోక్యో: జపాన్‌లో ఓ తల్లి సొంత కూతురుకు నరకం చూపించిన సంఘటన వెలుగు చూసింది. సదరు తల్లి తన బాయ్ ఫ్రెండుతో కలిసి కూతురుకు నరకం చూపించింది. ఈ సంఘటన జపాన్‌లోని పుక్వోకా ప్రాంతంలో వెలుగు చూసింది.

మీడయాలో వస్తున్న వార్తల ప్రకారం... తల్లి పేరు యుకో ఒగాటా, ఆమె బాయ్‌ఫ్రెండ్ పేరు టాకేషీ ఎగామి. కొంతకాలంగా వీరిద్దరూ కలిసి ఆ బాలికను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. తాజాగా ఇంట్లో పెంచుకునే 30 గోల్డెన్ ఫిష్‌లను ఒకదాని తర్వాత మరొకటి తినాలని తల్లి కూతురును బెదిరించింది.

Japanese mother forced daughter to eat 30 pet goldfish

గతంలో ఆ బాలికను మంచానికి కట్టివేసి, ముఖంపై కొట్టడమే కాకుండా ఆమె నాలుకపై సిగిరెట్టుతో కాల్చారు. ఈ దారుణాలన్నీ బయటపడటంతో పోలీసులు వాళ్లిద్దరినీ అరెస్ట్ చేశారు. ఇటువంటి దారుణ సంఘటనలు జపాన్‌లో తరచుగా జరుగుతుంటాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

చిన్న పిల్లల పట్ల దుష్ప్రవర్తన కేసులు ఇక్కడ ఈ ఏడాది అయిదు కేసులు నమోదయ్యాయి. గత నెలలో ఓ తల్లి తన మూడేళ్ల కూతురు పైన వేడి నీళ్లు పోసింది. దీంతో ఆ చిన్నారి ముఖంలో గాయాలయ్యాయి. ఆ ఆ చిన్నారి మృతి చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+