వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీ షాక్.. ఆమె సూట్‌కేస్‌లో ఏమున్నాయంటే..!

|
Google Oneindia TeluguNews

మెల్‌బోర్న్ : 27 ఏళ్ల జపాన్ యువతి ఆస్ట్రేలియా అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చి తిరిగి తన సొంత దేశానికి తిరుగు ప్రయాణమైన సందర్భంలో ఆమెకు ఊహించని పరిణామం ఎదురైంది. మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి జపాన్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకుంది. అయితే విమానాశ్రయం సెక్యూరిటీ సిబ్బంది సదరు యువతి సూట్‌కేస్‌ తనిఖీ చేసి ఖంగుతిన్నారు.

మోడీ వైపు గనక వేలు చూపిస్తే.. కోసి చేతిలో పెడతాం..! బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలుమోడీ వైపు గనక వేలు చూపిస్తే.. కోసి చేతిలో పెడతాం..! బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

సూట్‌కేస్‌ బాగోతం

సూట్‌కేస్‌ బాగోతం

సెక్యూరిటీ చెక్ లో భాగంగా ఆమె సూట్‌కేస్‌ ను స్కాన్ చేయడంతో అసలు విషయం బయటపడింది. అంతకుముందు సూట్‌కేస్‌ లో ఏమున్నాయంటూ ప్రశ్నించిన సెక్యూరిటీ సిబ్బందికి ఏమి లేవంటూ సమాధానమిచ్చింది ఆ యువతి. కానీ స్కాన్ లో సూట్‌కేస్‌ బాగోతం గుట్టురట్టైంది.

 తీరా ఒపెన్ చేస్తే..!

తీరా ఒపెన్ చేస్తే..!


ఆమె సూట్‌కేస్‌ స్కానింగ్ చేసేటప్పుడు అందులో ఏవో కదులుతున్నట్లు గుర్తించారు సెక్యూరిటీ సిబ్బంది. దాంతో సూట్‌కేస్‌ ఒపెన్ చేయాల్సిందిగా సదరు యువతిని ఆదేశించారు. తీరా ఒపెన్ చేసేసరికి.. అందులో 19 ఆస్ట్రేలియా జాతి బల్లులు దర్శనమిచ్చాయి. వాటిలో 17 షింగిల్ బ్యాక్ జాతికి చెందినవిగా.. మరో రెండు బ్లూ టంగ్ బల్లులుగా గుర్తించారు.

ఎందుకు తీసుకెళుతున్నట్లో..!

ఎందుకు తీసుకెళుతున్నట్లో..!

ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం పర్యావరణ పరిరక్షణకు భంగం కలిగించడం, ప్రకృతి వినాశనానికి పాల్పడటం అతి పెద్ద నేరం. ఆ క్రమంలో ఆస్ట్రేలియా జాతి బల్లుల్ని స్మగ్లింగ్ చేస్తోందనే కారణంతో ఆమెను అరెస్ట్ చేశారు. పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి విపత్తు నివారణ చట్టం 1999 సెక్షన్ 303DD (1) ప్రకారం కేస్ ఫైల్ చేశారు.

అదలావుంటే ఇంతకు ఆ యువతి వాటిని ఎందుకు తీసుకెళుతుందో మాత్రం చెప్పలేదు. ఒక్కసారే 19 బల్లులు ఆమెకు ఎలా వచ్చాయి. ఎవరినుంచైనా ఆమె కొనుగోలు చేసిందా.. తదితర విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే జపాన్ లో వీటిని మందుల తయారీలో వాడతారనే ప్రచారముంది.

English summary
A 27-year-old Japanese national has been arrested by Australian Border Force (ABF) officers at Melbourne International Airport allegedly attempting to smuggle 19 native reptiles out of Australia in her suitcase. It will be alleged an x-ray of her suitcase and subsequent examination revealed 17 Shingle Back lizards and two Blue Tongue lizards tightly packed inside two mesh packages. The woman was arrested and charged under section 303DD (1) of the Environment Protection and Biodiversity Conservation Act 1999.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X