ప్రియురాలి ప్రియుడి దారుణ హత్య: గుండె కోసి తినేశాడు
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. తన ప్రియురాలిని ప్రేమించిన వ్యక్తిని హత్య చేసి, ఆ తర్వాత కత్తితో కోసి అతని గుండెను బయటికి తీసిన ఓ నరహంతకుడు(62) ఫొర్కుతో తినేశాడు. బాధితుడి శరీర భాగాలను ఇంటి బయటపడేయడంతో ఆందోళనకు గురైన పొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నిందితుడ్ని చూసి ఒక్కసారిగా హతాశులయ్యారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు గురువారం మీడియాకు వెల్లడించారు. నిందితుడు జింబాబ్వేకు చెందిన వ్యక్తని తెలిపారు.

పోలీసులు నిందితుడి ఇంట్లోకి ప్రవేశించిన సమయంలోనే నిందితుడు బాధితుడి గుండెను కత్తి, ఫోర్కుల సహాయంతో తింటున్నాడని పోలీసు ఉన్నతాధికారి ఫ్రెడరిక్ వాన్ విక్ దక్షిణాఫ్రికా టైమ్స్‌కు తెలిపారు. దీంతో నిందితుడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు చెప్పారు. త్వరలోనే కోర్టులో ప్రవేశ పెడతామని చెప్పారు.
ఆయన కథనం ప్రకారం.. నిందితుడు ఓ 50ఏళ్ల మహిళను ప్రేమించాడు. ఆమె మరో వ్యక్తిని ప్రేమించి అతనితోనే కేప్‌టౌన్‌లో ఉంటోంది. కాగా, వారింటికి వెళ్లిన నిందితుడు వారితో మాట కలిపాడు. అనంతరం తాము మాట్లాడుకుంటామని చెప్పి... తన ప్రియురాలుకు డబ్బులిచ్చి మద్యం తీసుకురావాలని కోరాడు. దీంతో ఆమె బయటికి వెళ్లింది.
ఆమె తిరిగివచ్చేసరికి తన ప్రియుడిని చంపేస్తున్నాడు నిందితుడు. ఆమె వారించేందుకు ఎంత అరుపులు చేసినా వినకుండా అతన్ని హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే వారు కూడా అతని వద్దకు వెళ్లేందుకు మొదట భయపడ్డారని పోలీసు అధికారి చెప్పారు. త్రిముఖ ప్రేమాయణమే ఈ హత్యకు దారితీసిందని మరో పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications