రిచ్‌ లిస్టులో తొలిస్థానం కోల్పోయిన జెఫ్ బెజోస్ .. అగ్రస్థానంలో ఆయనే..!

ఇప్పటి వరకు ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనికుడు. అయితే తాజాగా విడుదలైన ప్రపంచ ధనికుల జాబితాలో రెండో స్థానానికి పడిపోయారు. ఆయనే అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్. మరి తొలిస్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరో తెలుసా.. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

 తొలి స్థానం కోల్పోయిన జెఫ్ బెజోస్

తొలి స్థానం కోల్పోయిన జెఫ్ బెజోస్

ప్రపంచంలోనే అత్యంత ధనికుల జాబితాలో తొలిస్థానంలో నిలిచిన ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తాజాగా వెల్లడైన ర్యాంకింగ్స్‌లో తన స్థానం కోల్పోయారు. తొలి స్థానంకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఎగబాకారు. అమెజాన్‌కు సంబంధించి మూడవ త్రైమాసికం ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో బెజోస్‌ 7బిలియన్ డాలర్లు స్టాక్ వాల్యూ కోల్పోయి తన ర్యాంకింగ్‌ను కూడా చేజార్చుకున్నారు.

 2018కు ముందు బిల్ గేట్స్ రికార్డు

2018కు ముందు బిల్ గేట్స్ రికార్డు

గురువారం ట్రేడింగ్ ముగిసేనాటికి అమెజాన్ షేర్లు 7శాతం పడిపోయాయి.దీంతో బెజోస్ ఆస్తుల విలువ 103.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకులు బిల్ గేట్స్ ఆస్తుల విలువ ప్రస్తుతం 105.7 బిలియన్ డాలర్లుగా ఉంది. 2018కి ముందు వరుసగా 24 ఏళ్లు బిల్‌గేట్స్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉంటూ రికార్డు సృష్టించారు. ఇక 2018లో 160 బిలియన్ డాలర్లతో భూమిపైనే అత్యంత ధనవంతుడిగా బెజోస్ కొత్త చరిత్ర సృష్టించారు.

26శాతం మేరా పడిపోయిన అమెజాన్ నికరలాభం

26శాతం మేరా పడిపోయిన అమెజాన్ నికరలాభం

ఇక మూడవ త్రైమాసిక ఫలితాల విడుదల తర్వాత అమెజాన్ నికరలాభం 26శాతం తగ్గిందని పేర్కొంది. 2017 తర్వాత తొలిసారిగా వచ్చిన లాభాల నుంచి తగ్గుముఖం పట్టినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. ఇక షేర్ల విషయానికొస్తే కొన్ని గంటల పాటు ట్రేడింగ్ తర్వాత షేర్ వాల్యూ 9శాతం పడిపోయి ఒక్క షేరు విలువ 1,624 డాలర్లకు చేరుకుందని వెల్లడించింది. ఇక ఫోర్బ్స్ 1987లో తన తొలి బిలియనీర్ల జాబితాను విడుదల చేయగా ఆ సమయంలో గేట్స్ 1.25 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచారు.

 1998లో ఫోర్బ్స్ జాబితాలో బెజోస్‌కు చోటు

1998లో ఫోర్బ్స్ జాబితాలో బెజోస్‌కు చోటు

ఇక జెఫ్ బెజోస్ ఫోర్బ్స్ జాబితాలో 1998లో చోటుసంపాదించారు. అమెజాన్ షేర్లు బహిరంగంగా వెళ్లిన ఏడాదికి చోటు సంపాదించుకున్నారు జెఫ్ బెజోస్. ఆ సమయంలో ఆయన ఆస్తుల విలువ 1.6 బిలియన్ డాలర్లుగా ఉన్నింది. ఇదిలా ఉంటే జెఫ్ బెజోస్ తన భార్యకు ఈ ఏడాది విడాకులు ఇవ్వడంతో భరణం కింద ఆమెకు పెద్దమొత్తంలో చెల్లించారు. ఇది చరిత్రలోనే అత్యంత పెద్ద సెటిల్‌మెంట్‌గా నిపుణులు చెబుతారు. బెజోస్ స్టాక్స్ నుంచి మెకెంజీ బెజోస్‌కు 36 బిలియన్ డాలర్లు సెటిల్‌మెంట్ కింద చెల్లించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+