జెఫ్ బెజోస్‌కు తొలి దెబ్బ: ఆ ప్రయోగం ఘోరంగా విఫలం..!!

వాషింగ్టన్: అపర కుబేరుడు జెఫ్ బెజోస్‌కు చెందిన రాకెట్ కంపెనీ బ్లూ ఆరిజిన్.. తొలి వైఫల్యాన్ని చవి చూసింది. సబ్‌ ఆర్బిటల్ న్యూ షెపర్డ్ రాకెట్‌ను వెస్ట్ టెక్సాస్‌ నుంచి ప్రయోగించిన కొద్ది సేపటికే నేలకూలింది. బ్లూ ఆరిజిన్‌కు ఇది తొలి వైఫల్యం. ఈ సెగ్మెంట్‌లో అడుగు పెట్టిన తరువాత జెఫ్ బెజోస్ కంపెనీకి ఇది మొదటి పెద్ద వైఫల్యం. ఈ ప్రయోగం విఫలం కావడానికి బ్లూ ఆరిజిన్ గల కారణాలను వివరించలేదు.

బ్లూ ఆరిజిన్ రాకెట్ లిఫ్ట్‌ ఆఫ్ అయిన నిమిషం తరువాత పశ్చిమ టెక్సాస్‌ గగనతలంలోకి దూసుకెళ్లింది. న్యూ షెపర్డ్ ప్రోగ్రామ్ కోసం ప్రయోగించిన 23వ ప్రాజెక్ట్ ఇది. అంతరిక్షంలో మొదటి అమెరికన్ వ్యోమగామి అలాన్ షెపర్డ్ పేరు ఈ ప్రాజెక్టుకు పెట్టిందా కంపెనీ. పేలోడ్‌ల హోస్ట్‌ను మోసుకెళ్లే ఈ ఫ్లైట్‌లో ప్రయోగ సమయంలో ఎవరూ లేరని, ఈ ఘటనపై విచారణ జరుపుతామని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.

Jeff Bezoss Blue Origin rocket experiences booster failure as suffered its first launch failure

ఈ ప్రయోగం విఫలం కావడానికి గల వివరాలు వెల్లడించనప్పటికీ.. న్యూ షెపర్డ్ రాకెట్ ఇంజిన్‌లో సాంకేతిక లోపాలు తలెత్తినట్లు భావిస్తోన్నారు. ఈ ప్రయోగం విఫలమైంది.. అంటూ బ్లూ ఆరిజిన్ స్పేస్ మార్కెటింగ్ సీనియర్ డైరెక్టర్ ఎరికా వాగ్నర్ చెప్పారు. పేలోడ్‌లను తీసుకెళ్లడానికి రాకెట్ పైభాగంలో అమర్చిన క్యాప్సూల్, దాని థ్రస్టర్‌‌ను మండించిన వెంటనే రాకెట్ నుంచి అది వేరు పడిందని చెప్పారు. పారాష్యూట్ల ద్వారా క్యాప్సుల్ సురక్షితంగా ల్యాండ్ అయినట్లు చెప్పారు.

న్యూ షెపర్డ్ బూస్టర్‌కు సంబంధించిన 9వ ప్లాన్డ్ ఫ్లైట్ ఇది. బ్లూ ఆరిజిన్ రూపొందించిన మొట్టమొదటి ఆల్-పేలోడ్ న్యూ షెపర్డ్ ఫ్లైట్ కూడా. 2021 జూలై నుంచి ఈ ఫ్లైట్‌లో ప్రయాణీకులను అంతరిక్షానికి తీసుకెళ్లడానికి శ్రీకారం చుట్టింది. దీన్ని మరోసారి చేపడతామని ఎరికా వాగ్నర్ తెలిపారు. బ్లూ ఆరిజిన్‌ ఎదుర్కొన్న మొట్టమొదటి ఫెయిల్యూర్ కావడం వల్ల.. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+