Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాలుగోపెళ్లికి సిద్దమన్న జెన్నీఫర్, కూతురు కోసం డెమీ

పాప్ గాయని, హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపెజ్ మరో వివాహానికి సిద్ధమవుతోంది. సంతోషమయ జీవితం గడిపేందుకు భర్త అవసరమని ఆమె భావిస్తోందట. ఇప్పటికే ఈ బ్యూటీకి మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి. ఓజాని నోయా, క్రిస్ జూడ్, మార్క్ ఆంటోనీలతో విడాకులు తీసుకున్న ఈ అందాల సుందరి తన స్నేహితురాలు చెల్సియా హ్యండ్లర్ నిర్వహించిన ఓ టాక్ షోలో మాట్లాడింది.

నాలుగో పెళ్ళికి సంసిద్ధత వ్యక్తం చేసింది. నూతన ప్రియుడి గురించిన వివరాలు కూడా ఆ షోలో వెల్లడించిందట. కాగా, ఆంటోనీతో వైవాహిక జీవితంలో లోపెజ్‌కు కవలలు జన్మించారు.

డెమీ మూర్‌కు కూతురు బాధ

Jennifer Lopez tells she'd like to remarry

హాలీవుడ్ సెక్సీ హీరోయిన్ డెమీమూర్ తన చిన్న కూతురు గురించి కన్నీళ్ల పర్యంతమవుతోందట. చిన్న కుమార్తె తల్లులా మద్యం, డ్రగ్స్‌కు బానిసైంది.

దీంతో డెమీమూర్ తన కుమార్తెను రిహాబిలిటేషన్ సెంటర్‌లో చేర్చి వ్యసనాలబారి నుంచి కాపాడే ప్రయత్నంలో పడింది. మరోవైపు భర్త అష్టన్ కుచ్చెర్‌తో డెమీమూర్ విడిపోయింది. దీంతో ఆమె పూర్తిగా సమస్యల్లో చిక్కుకుంది. కుమార్తె జీవితం బాగుచేయడం, తాను బాధ నుంచి బయటపడడం సాధ్యంకాక సతమతమవుతున్న డెమీమూర్‌కు పెద్ద కూతురు రుమెర్ బాసటగా నిలుస్తోంది. కాగా, చిన్న కూతురు తలులా క్రమంగా మెరుగుపడుతోందట.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+