వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ గొప్ప వ్యక్తి: జిహాదీ సంస్థల ప్రశంస, ఆపిల్‌కు ఇబ్బందే!

ఇస్లామిక్ దేశాల పౌరులను అమెరికా రాకుండా నిషేధం విధించిన డొనాల్డ్ ట్రంప్‌ను ఐసిస్ సహా పలు జిహాదీ గ్రూపులు పొగుడుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఇస్లామిక్ దేశాల పౌరులను అమెరికా రాకుండా నిషేధం విధించిన డొనాల్డ్ ట్రంప్‌ను ఐసిస్ సహా పలు జిహాదీ గ్రూపులు పొగుడుతున్నాయి. ట్రంప్ నిర్ణయం వెలువడగానే విజయోత్సవాలు జరుపుకున్నాయి.

అందుకు కారణం ఉంది. ట్రంప్ తన తీరుతో ముస్లీంలు, ముస్లీం దేశాలు ఒక్క తాటి పైకి వచ్చేలా చేశాయని అంటున్నారు. ముస్లీంలు ఒక్కతాటికి వచ్చేలా చేసిన గొప్ప వ్యక్తి ట్రంప్ అని పొగడుతున్నారు.

సిరియా శరణార్థుల వలస పైన నిరవధిక నిషేధంతో పాటు ఇస్లామిక్ దేశాలైన ఇరాక్, సిరియా, ఇరాన్, సూడాన్, లిబియా, సోమాలియా, యెమెన్ పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపివేస్తూ ట్రంప్ ఆర్డర్ జారీ చేసిన మరుసటి రోజు నుంచి జిహాదీ గ్రూపులు పండుక చేసుకుంటున్నట్లు ఐసిస్ అధికార వార్తా పత్రిక, అనధికారిక వెబ్ సైట్లలో వార్తలు వచ్చాయి.

ట్రంప్‌కు షాక్ మీద షాక్: వారికి 10వేల ఉద్యోగాలిస్తామన్న సంస్థ ట్రంప్‌కు షాక్ మీద షాక్: వారికి 10వేల ఉద్యోగాలిస్తామన్న సంస్థ

ట్రంప్ విధానాలతో విదేశాల నుంచి వచ్చే ముస్లీంలే కాక, అక్కడే పుట్టి పెరిగిన అమెరికన్ ముస్లీంలను కూడా ఒత్తిడికి గురి చేస్తుందని.. అప్పుడు అమెరికన్ ముస్లీంలు జిహాదీలకు మద్దతు పలుకుతారని ఐసిస్ అనుబంధ వెబ్ సైట్ వెల్లడించింది. ట్రంప్ అతి త్వరలో మిడిల్ ఈస్ట్ దేశాలపై యుద్ధానికి దిగుతారని జోస్యం చెప్పింది.

వ్యతిరేకించిన అటార్నీ జనరల్స్

వ్యతిరేకించిన అటార్నీ జనరల్స్

వలసలు, శరణార్థులు, సరిహద్దులకు సంబంధించి ట్రంప్‌ జారీ చేసిన ఉత్తర్వులను అమెరికాలోని 16 రాష్ట్రాల అటార్నీ జనరల్స్‌ వ్యతిరేకించారు. కాలిఫోర్నియా, న్యూయార్క్‌లకు చెందిన వారు సహా పలు రాష్ట్రాల అటార్నీ జనరల్స్‌ ట్రంప్‌ ఉత్తర్వులు చట్టవ్యతిరేకమని, దీనిపై పోరాటం చేస్తామని తెలిపారు.

అటార్నీ జనరల్స్

అటార్నీ జనరల్స్

ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారిలో ఇల్లినాయిస్‌, కాలిఫోర్నియా, కనెక్టికట్‌, కొలంబియా, హవాయి, అయోవా, మైనే, మేరీల్యాండ్‌, మసాచుసెట్స్‌, న్యూ మెక్సికో, న్యూయార్క్‌, ఓరెగాన్‌, పెన్సిల్వేనియా, వెర్మౌంట్‌, వర్జీనియా, వాషింగ్టన్‌లకు చెందిన అటార్నీ జనరల్స్‌ ఉన్నారు. ఏడు ముస్లిం మెజారిటీ దేశాల నుంచి వలసలు, శరణార్థులపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్‌ ఇటీవల కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన సంగతి తెలిసిందే.

సొంత దేశంలో తయారీ..

సొంత దేశంలో తయారీ..

'అమెరికాలో తయారు చేయండి' అని ట్రంప్‌ ఇచ్చిన పిలుపును అమలు చేయడం అన్ని పరిశ్రమలకూ సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

యాపిల్‌కు ఇబ్బంది

యాపిల్‌కు ఇబ్బంది

ఐ-ఫోన్ల తయారీదారీ సంస్థ ఆపిల్‌కు కూడా ఇది ఇబ్బందికరంగా మారింది. దీనిపై ఆపిల్ ఏం చెప్పలేదు. ఆపిల్‌కు ముఖ్య కాంట్రాక్టర్ అయిన తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ మాత్రం ఏడు బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఫ్లాట్‌ ప్యానళ్ల తయారీ పరిశ్రమను నెలకొల్పడానికి ముందుకు వచ్చింది.

English summary
Jihadist groups on Sunday celebrated the Trump administration's ban on travel from seven Muslim-majority countries, saying the new policy validates their claim that the United States is at war with Islam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X