తనను వదిలేశాడని: ప్రియుడిపై మోడల్ ఇలా పగతీర్చుకుంది

రష్యాకు చెందిన మోడల్ క్రిస్టినా కుచ్మా తన ప్రియుడు తనకు బ్రేకప్ చెప్పాడనే కోపంతో అతని కారును స్విమ్మింగ్ పూల్‌లో తోసేసింది.రష్యాకి చెందిన గాయ్ జెంటిల్‌ అనే 41 ఏళ్ల వ్యక్తి బ్యాంకు ఉద్యోగి. ఇతనికి కొ

మాస్కో: రష్యాకు చెందిన మోడల్ క్రిస్టినా కుచ్మా తన ప్రియుడు తనకు బ్రేకప్ చెప్పాడనే కోపంతో అతని కారును స్విమ్మింగ్ పూల్‌లో తోసేసింది.

రష్యాకి చెందిన గాయ్ జెంటిల్‌ అనే 41 ఏళ్ల వ్యక్తి బ్యాంకు ఉద్యోగి. ఇతనికి కొద్ది రోజుల క్రితం క్రిస్టినా అనే మోడల్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నారు.

గాయ్ జెంటిల్ బ్యాంక్‌ ఉద్యోగి కాబట్టి క్రిస్టినాకు వ్యాపారం ప్రారంభించడానికి లోన్ ఇప్పిస్తానని చెప్పాడు. గత వారం ఇద్దరూ డిన్నర్‌ కోసం ఓ హోటల్‌కు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో తెలీదు కానీ గాయ్‌.. క్రిస్టినాను హోటల్‌ దగ్గరే వదిలేసి వెళ్లిపోయాడు. దాంతో అతనిపై పగ తీర్చుకోవాలనుకుంది.

Jilted girlfriend of prominent US banker dumps his Mercedes into swimming pool

Recommended Video

    Facebook Friend Murder Hyderabad | ఫేస్‌బుక్‌ ఫ్రెండే హంతకుడు - Oneindia Telugu

    వెంటనే ప్రియుడు నివసిస్తున్న ఇంట్లోకి వెళ్లి అతని మెర్సిడెస్‌ ఎస్‌400 కారును స్విమ్మింగ్‌ పూల్లోకి నెట్టేసింది. అంతేకాదు, నీకు కావాల్సిన సర్‌ప్రైజ్‌ మీ ఇంటి వెనకే ఉంది అని పేపర్ పైన రాసి పెట్టింది.

    తర్వాత ఇంటికి వచ్చిన గాయ్.. క్రిస్టినా కూడా కారులో ఉందేమో అని భయపడ్డాడు. కానీ ఆమె లేదు, కారు మాత్రమే స్విమ్మింగ్ పూల్‌లో ఉందని తెలిసి ఊపిరిపీల్చుకున్నాడు. అంతేకాదు, క్రిస్టినాను వదిలించుకున్నందుకు కూడా ఊపిరిపీల్చుకున్నాడు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+