డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడు కావొచ్చు: బైడెన్ వ్యాఖ్యలతో దద్దరిల్లింది

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో డొనాల్డ్ ట్రంప్.. మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక అవుతారేమోనని వ్యాఖ్యానించారు.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో డొనాల్డ్ ట్రంప్.. మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక అవుతారేమోనని వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యాఖ్యలకు సభికుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం కావడం గమనార్హం.

పెన్సిల్వేనియాలో బడ్జెట్ ప్రతిపాదన గురించి ప్రసంగించిన బైడెన్.. 2020 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తనకు, ట్రంప్ కి మధ్య నెలకొన్న తీవ్ర పోటీని తాజాగా గుర్తుచేసుకున్నారు. అధ్యక్ష పదవి కోసం తాను మాజీ అధ్యక్షుడితో పోటీ పడిన సందర్భాన్ని మీరంతా భవిష్యత్తులో గుర్తు చేసుకుంటారన్నారు.

 Joe Biden calls Donald Trump ‘maybe future US President’

డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావచ్చేమో అని బైడెన్ వ్యాఖ్యానించారు. బైడెన్ ప్రసంగంలో ట్రంప్ ప్రస్తావన వచ్చిన వెంటనే అక్కడున్న వారంతా పెద్ద ఎత్తున ట్రంప్ కు మద్దతుగా నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అంటే చాలా మంది అమెరికన్లు మరోసారి ట్రంప్ ను అధ్యక్షుడిగా చూడాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

కాగా, 2024లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి పోటీ చేయబోతున్నట్లు ట్రంప్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. బైడెన్ అనుసరిస్తున్న విధానాల కారణంగా అమెరికా ఒక విఫల దేశంగా మారిందని ట్రంప్ విమర్శించారు. ఇది ఇలావుంటే, 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిత్వాన్ని దక్కించుకునేందుకు భారతీయ అమెరికన్లు వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఇక డెమొక్రటిక్ పార్టీ తరపున మరో భారతీయ అమెరికన్ రో ఖన్నా కూడా పోటీలో ఉండేందుకు సిద్ధమయ్యారు. అయితే, జో బైడెన్ కూడా వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+